News
News
X

Chittoor News: మద్యం సేవించి తల్లిని హింసిస్తున్నాడని, ఆ కొడుకు దారుణం ! సహకరించింది ఎవరో తెలిస్తే షాక్

Student Kills His Father: మద్యం సేవించి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని హత్య చేశాడు ఓ టీనేజర్. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన సంచలనంగా మారింది. 

FOLLOW US: 

Chittoor Teenager Kills His Father: తిరుపతి : లోకంలో మనకు తల్లిదండ్రుల కంటే ఎవరూ ఎక్కువ కాదు. కానీ తమ బిడ్డల ఆనందమే వారక సంతోషంగా భావించి కంటికి రెప్పల కాపాడుకుంటూ వస్తారు. తల్లిదండ్రుల్లో తల్లికి సమస్య వస్తే.. అది కూడా తండ్రి నుంచి నిత్యం నరకం ఎదురైతే పిల్లలు ఇంతలా మారిపోతారా అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం. మద్యం సేవించి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని హత్య చేశాడు ఓ టీనేజర్. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన సంచలనంగా మారింది. 

తమిళనాడు నుంచి చిత్తూరుకు వలసొచ్చి.. 
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లె శివారు ప్రాంతంమైన నిమ్మనపల్లెలో గాంధీ కదిరేశన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. చేనేత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని  పోషించేవాడు.‌ బతుకు దెరువు కోసం తమిళనాడు‌ నుండి వచ్చి గాంధీ కదిరేశన్, అతని‌ భార్య మలైకోడి నిమ్మనపల్లెలోనే ఉంటున్నారు. గాంధీ కదిరేశన్, మలైకోడి దంపతులకు ఓ కుమారుడు, ఓ‌కుమార్తె ఉన్నారు. కుమారుడ్ని తమిళనాడులో ఇంటర్మీడియట్ చదువిస్తుండగా, కుమార్తె కుమారిని మదనపల్లెలో చదివిస్తున్నారు. 

మద్యం మహమ్మారి.. 
కొంతకాలం కిందటి వరకు గాంధీ కదిరేశన్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. అయితే అతడు మద్యానికి బానిస కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గాంధీ మద్యం సేవించి‌ ఇంటికి వచ్చిన ప్రతిసారి భార్య మలైకోడిని, కుమార్తె కుమారిని చిత్రహింసలకు గురి చేసేవాడు. పచ్చి మిరపకాయలు తినమంటూ పలు రకాలుగా వేధింపులకు గురిచేయడాన్ని మలైకొడి తట్టుకోలేకపోయింది. భర్త పెట్టే హింస భరించలేక పుట్టింటికి వెళ్లినా అక్కడికి వెళ్లి కూడా కదిరేశన్ ఆమెను ఇబ్బందులకు గురి చేసేవాడు. దీంతో చేసేదేమీలేక పుట్టింటి నుంచి తిరిగొచ్చేసేది.

కుటుంబ సభ్యులను గాంధీ కదిరేశన్ పెట్టే చిత్రహింసలను చూసి ఇరుగు పొరుగు వాళ్ళు ప్రశ్నించినా వారితో గొడవకు దిగ్గేవాడు. ఈక్రమంలో తమిళనాడులో చదువుకుంటున్న కుమారుడు ఇంటికి రాగానే తన బాధను కుమారుడికి తల్లి మలైకోడి చెప్పుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన టీనేజర్ ఇంట్లో ఉన్న బ్లేడ్ తీసుకుని తల్లి, సోదరి సహకారంతో తండ్రి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్త్రావమై కదిరేశన్ చనిపోయాడు. తన తండ్రిని హత్య చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Also Read: Tirupati Accident: ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పెళ్లి బస్సు బోల్తా - చిన్నారి సహా ఏడుగురు మృతి

Also Read: Srikakulam Crime : పట్టపగలే గొడ్డళ్లతో వెంటపడి వాలంటీర్ దారుణ హత్య, డీఎస్పీ ఆఫీస్ పక్కనే ఘటన!

Published at : 27 Mar 2022 08:38 AM (IST) Tags: ANDHRA PRADESH AP News Chittoor tirupati Liquor

సంబంధిత కథనాలు

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

Nizamabad Crime : నిజామాబాద్ లో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఒంటరి మహిళలే టార్గెట్!

Nizamabad Crime : నిజామాబాద్ లో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఒంటరి మహిళలే టార్గెట్!

Visakha News : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత, సముద్రంలో షిప్ లను అడ్డుకుంటున్న మత్స్యకారులు

Visakha News : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత, సముద్రంలో షిప్ లను అడ్డుకుంటున్న మత్స్యకారులు

Kakinada Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు

Kakinada Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు

Ankita Bhandari Murder Case: యువతి హత్య కేసులో భాజపా లీడర్‌ కొడుకు అరెస్ట్, చంపి కాలువలో పడేసిన నిందితులు

Ankita Bhandari Murder Case: యువతి హత్య కేసులో భాజపా లీడర్‌ కొడుకు అరెస్ట్, చంపి కాలువలో పడేసిన నిందితులు

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?