News
News
X

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Renigunta Fire Accident: రేణిగుంట టౌన్ లోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ హాస్పిటల్ లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం.

FOLLOW US: 
 
Renigunta Fire Accident: తిరుపతి : చిత్తూరు జిల్లా రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రేణిగుంట టౌన్ లోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ హాస్పిటల్ లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో మంటలను గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబం వారు కావడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హాస్పిటల్ భవనంలో అగ్ని ప్రమాదం.. చిన్నారులు మృతి
నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ బిల్డింగ్ పై పోర్షన్ లో నివాసం ఉంటున్న డాక్టర్ రవిశంకర్ కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్న కార్తిక (6), సిద్ధార్థ రెడ్డి (11), రామసుబ్బమ్మ, డాక్టర్ అనంతలక్ష్మిలను బయటకు తీసుకొచ్చారు. వీరిని చికిత్స కోసం డీబీఆర్ ఆసుపత్రికి పోలీసులు, సిబ్బంది తరలించారు. కానీ ఇద్దరు చిన్నారులు అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఊపిరి ఆడకపోవడంతో చిన్నారులు చనిపోయారని తెలుస్తోంది.

 డాక్టర్ ప్రాణాలు సైతం దక్కలేదు..
 కాగా, బిల్డింగ్ లోపల ఉన్న డాక్టర్ రవిశంకర్ రెడ్డి(45) కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అతికష్టమ్మీద డాక్టర్ రవిశంకర్ ను రెస్క్యూ టీమ్ బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. కానీ అప్పటికే మంటల్లో ఆయన శరీరం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టనున్నారు. మంటల్ని గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో కొందరి ప్రాణాలైనా వారు కాపాడగలిగారని చెబుతున్నారు. ఆసుపత్రిలో భారీ ఎత్తున ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, పిఒపి డిజైన్, అట్టపెట్టెలు ఉండటంతో మరింత వేగంగా మంటలు వ్యాప్తి చెందాయని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు.

రేణిగుంట అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి వివరాల వీడియో  

News Reels

రుయా ఆసుపత్రికి మృతదేహాల తరలింపు 
డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఆయన పిల్లలు కార్తిక (6), సిద్ధార్థ రెడ్డి (11)ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రి (Ruia Government General Hospital)కి తరలించారు పోలీసులు. రవిశంకర్ స్వస్థలం జమ్మలమడుగు. బతుకుదెరువు కోసం రేణిగుంటకు వచ్చి సెటిల్ అవుతున్న క్రమంలో కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని స్థానికులు అంటున్నారు. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో వారంతా నిద్రలోనే ఉన్నారని, అందువల్లే ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టం అధికంగా ఉందని తెలుస్తోంది. డాక్టర్ రవిశంకర్ రెడ్డి భార్య అనంతలక్ష్మి, తల్లి రామసుబ్బమ్మకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది... ఇంట్లో ఉన్న ఐదు మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరిని మాత్రమే ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు.

Published at : 25 Sep 2022 08:04 AM (IST) Tags: Chittoor Crime News Hospital Renigunta Fire Accident Renigunta Fire Accident

సంబంధిత కథనాలు

Karimnagar Crime :  ఆడపిల్లలను కొనుగోలు చేసి వ్యభిచార కూపంలోకి, వ్యభిచార ముఠా గుట్టురట్టు!

Karimnagar Crime : ఆడపిల్లలను కొనుగోలు చేసి వ్యభిచార కూపంలోకి, వ్యభిచార ముఠా గుట్టురట్టు!

Tirupati Boys Missing : తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం!

Tirupati Boys Missing : తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం!

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

Alluri Sitarama Raju District: భూసర్వే టార్గెట్‌లు, ఉన్నతాధికారుల మాటలు పడలేక తహసీల్దార్ ఆత్మహత్య!

Alluri Sitarama Raju District: భూసర్వే టార్గెట్‌లు, ఉన్నతాధికారుల మాటలు పడలేక తహసీల్దార్ ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!