By: ABP Desam | Updated at : 12 Jan 2023 08:27 PM (IST)
స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందని ఫోన్ కాల్( Image Source : File Photo/AFP )
స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడం కలకలం రేపింది. ఢిల్లీ నుంచి పుణే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్ విమానంలో ఉందని టేకాఫ్ కు కొన్ని నిమిషాల ముందు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న CISF & ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు ఏఎన్ఐ మీడియాకు తెలిపారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి పుణేకు స్పైస్ జెట్ విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా, అంతకు కొన్ని నిమిషాల ముందు విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది.
A call regarding a bomb in Pune-bound Spicejet flight from Delhi was received before the takeoff. CISF & Delhi Police are on alert. Flight being checked at Delhi Airport: Delhi Police pic.twitter.com/nQLrtSOqlv
— ANI (@ANI) January 12, 2023
ఫ్లైట్ సిబ్బంది విమానం నుంచి ప్రయాణికులను కిందకు దించివేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ టీమ్ స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు చేపట్టింది. అయితే తమకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ప్రయాణికుల భద్రత పట్ల అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం - వైద్యదంపతులు సహా ఆరుగురు మృతి
UP Crime News: భర్త నాలుకను కొరికి పడేసిన భార్య, అసలేం జరిగిందంటే?
Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు, ఒకరు మృతి
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?