By: ABP Desam | Updated at : 19 Dec 2022 12:25 PM (IST)
చనిపోయిన విద్యార్థి
బాసర ట్రిపుల్ ఐటీలో మరో వివాదం రాజుకుంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ క్యాంపస్‌లో రెండు సార్లు పర్యటించి సమస్యలను కాస్త చక్కదిద్దారని ఊరట చెందే లోపే ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ 2 చదువుతున్న భాను ప్రసాద్ అనే విద్యార్థి సూసైట్ నోట్ రాసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అప్పట్లో కౌన్సెలింగ్ ఇచ్చారు.
మళ్లీ ఇప్పుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి మృతి నేపథ్యంలో అధికారులు బాసర ట్రిపుల్ ఐటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, విద్యార్థులంతా కలిసి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు నిరసనకు దిగారు. ఫ్యాకల్టీ ఒత్తిడి వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థి ఆత్మహత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బాసర ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. భాను ప్రసాద్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచెల్ మండలం రంగాపూర్ గ్రామం.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని నిర్మల్ జిల్లా ఆసుపత్రిలోకి బీజేపీ, ఏబీవీపీ నాయకులు చొచ్చుకెళ్ళారు. భాను ప్రసాద్ మరణం పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్ళిన బీజేపీ నాయకులను, ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆత్మహత్య కాదు - కుటుంబ సభ్యుల ఆందోళన, ఎస్పీకి ఫిర్యాదు
భాను ప్రసాద్ ది ముమ్మాటికి ఆత్మహత్య కాదని, బలవంతంగా జరిపిన హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని భాను ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిబుల్ ఐటీ యాజమాన్యం సూసైడ్ నోట్ ను ఫోర్జరీ చేసి చూయిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భాను ప్రసాద్ చదువులో చురుకైన వ్యక్తి అని, అతనికి ఇంటి వద్ద ఎలాంటి ఒత్తిడి గాని ఆర్థిక భారంగాని లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బాబుది ఆత్మహత్య కాదు.. బలవన్మరణానికి పాల్పడేలా చేసిన బాసర ట్రిబుల్ ఐటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు
ఆత్మహత్య చేసుకున్న భాను ప్రసాద్ మృత దేహానికి నిర్మల్ జిల్లాలో పోస్టుమార్టం పూర్తిచేశారు వైద్యులు. త్వరలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని, దాని తదుపరి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.
Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం
Kurnool News : కర్నూలులో దొంగ పోలీసులు - పోలీస్ స్టేషన్లోనే 105 కేజీల వెండి కొట్టేసి దొరికిపోయారు !
Satyakumar Car Attack : చివరి కారుకు రాయి తగిలింది, కారులో సత్యకుమార్ ఉన్నారో లేరో తెలియదు- ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్
Cell Phones Recovery : సెల్ ఫోన్ మిస్సైందా? చాట్ బాట్ కు హాయ్ చెబితే దొరికేస్తుంది!
Case On Raja Singh : తీరుమార్చుకోని రాజాసింగ్, శోభాయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు- కేసు నమోదు
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...
PBKS Vs KKR: కోల్కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!
Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు