అన్వేషించండి

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

Bapatla Crime : బాపట్ల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మద్యానికి బానిసైన భర్త భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

Bapatla Crime : బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే భార్యను కడతేర్చాడు. నిజాంపట్నం మండలం ఆముదాలపల్లిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యను భర్త కత్తితో పీక‌ కోసి హత్య చేయడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. నాగరాజు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై  భార్య రమాదేవిని వేధించండం, దాడి చేయడం నిత్యకృత్యంగా మారింది. వేధింపులు భరించలేక తన పుట్టింటికి వెళ్లింది రమాదేవి. ప్రతిరోజు మద్యం తాగి భార్య పుట్టింటి వద్దకు వెళ్లి తాగాదాలాడటం ఇంటికి రావాలని లేకపోతే చంపేస్తానని బెదిరించడం చేసేవాడు. శనివారం మధ్వాహ్నం ఫూటుగా తాగిన నాగరాజు భార్య ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో రమాదేవి  నిద్రపోతుంది. ఆమె తల్లిదండ్రులు పొలం పనులు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు మద్యమత్తులో ఉన్న నాగరాజు నిద్రిస్తున్న రమాదేవిపై కత్తితో దాడి చేసి గొంతు కోయడంతో ఆమె అక్కడక్కడే  మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు. తల్లి మృతదేహం వద్ద చిన్నారులు విలపించడం అక్కడ ఉన్న  ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. హత్య చేసిన అనంతరం నిందితుడు నాగరాజు పోలీసులకు లొంగి పోయాడు. 

సినీఫక్కీలో భర్త మర్డర్ 

ఇంతకుముందు జరిగిన క్రైమ్స్ ఆధారంగా సినిమాలు తీశేవారు.. కానీ ఇప్పుడు అవే క్రైమ్ సినిమాలు చూసి తెలివిగా నేరాలు చేస్తున్నారు కొంతమంది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ క్రైమ్ సీన్.. 'దృశ్యం-2' సినిమాను తలపించింది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించి.. చివరకు పోలీసులకు దొరికి పోయింది. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో ఉండే ఓ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. కానీ భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. అదే సమయంలో ఆ భార్యకు.. మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొన్ని రోజులకు భార్య వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసింది. ఇదే విషయమై ఇటీవల ఓ రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్‌ వేసింది. ప్రియుడు ఇంటి వెనుక ద్వారం నుంచి అప్పటికే రాగా.. ఆమె తన భర్తను గొంతు కోసి చంపేసింది. ఆవుల కొట్టంలో నుంచి తాడు తెచ్చి కాళ్లు, చేతులను దగ్గరికి లాగి తాళ్లతో కట్టేసి సంచిలో వేశారు.

భర్త కనిపించడంలేదని ఫిర్యాదు 

కారులో మృతదేహాన్ని రామ్ నగర్ వద్దకు తీసుకెళ్లారు. మృతుడి ఫోన్‌ను ఓ ఖాళీ ప్రదేశంలో పడేశారు. తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఒక్కొక్కటిగా వేరే వేరే ప్రదేశంలో విసిరేశారు. తరువాత భర్త మృతదేహాన్ని మైసూరు-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఓ కాలువలో 50 మీటర్ల లోతులో మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తర్వాత రోజు మహిళ తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని దర్యాప్తులో తెలిసింది. రాంనగర్ జిల్లా కెంపేగౌడ దొడ్డి సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెతో సహా తన ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలుపట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget