Ayodhya: అయోధ్యలో యువతి దారుణ హత్య - మీడియా ముందు కన్నీటి పర్యంతమైన ఎంపీ
MP Tears: అయోధ్యలో యువతి దారుణ హత్యాచార ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎంపీ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవుతూ రాజీనామాకు సిద్ధమయ్యారు.

Ayodhya MP Breaks Into Tears In Young Woman Murder Case: అయోధ్యలో (Ayodhya) యువతి దారుణ హత్య ఘటనకు సంబంధించి ఎంపీ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. యువతి అదృశ్యమై మూడు రోజులవుతున్నా ఆమెను కాపాడలేకపోయామని.. చివరకి దారుణంగా హత్యాచారానికి గురైనట్లు పేర్కొంటూ బోరున విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. అయోధ్య ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) గురువారం రాత్రి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అయితే, వివస్త్రగా ఉన్న యువతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు వారి గ్రామానికి కొంత దూరంలోని కాలువలో గుర్తించారు. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి దారుణంగా హత్య చేసినట్లు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి శరీరంలోని వివిధ భాగాలపై లోతైన గాయాలున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అయితే, పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఎంపీ కన్నీళ్లు
यह जघन्य अपराध बेहद दुःखद हैं।
— Awadhesh Prasad (@Awadheshprasad_) February 2, 2025
अयोध्या के ग्रामसभा सहनवां, सरदार पटेल वार्ड में 3 दिन से गायब दलित परिवार की बेटी का शव निर्वस्त्र अवस्था में मिला है, उसकी दोनों आँखें फोड़ दी गई हैं उसके साथ अमानवीय व्यवहार हुआ है।
यह सरकार इंसाफ नही कर सकती। pic.twitter.com/aSvI3N74Kl
ఈ ఘటనపై అయోధ్య (ఫైజాబాద్) ఎంపీ అవధేష్ ప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. యువతి ప్రాణాలు కాపాడలేనందున పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. దీంతో పార్టీ నేతలు ఆయన్ను సముదాయించారు. ఈ విషయంపై ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని.. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయడానికి పోరాడాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

