News
News
వీడియోలు ఆటలు
X

Atiq Ahmed Case: రిపోర్టింగ్‌లో క్రాష్ కోర్స్ చేసి మరీ హత్య, నిందితులకు సహకరించిన ముగ్గురు జర్నలిస్ట్‌లు అరెస్ట్

Atiq Ahmed Case: అతిక్ అహ్మద్‌ను హత్య చేసే ముందు నిందితులు రిపోర్టింగ్‌లో క్రాష్ కోర్స్ చేశారు.

FOLLOW US: 
Share:

Atiq Ahmed Case:

జర్నలిస్ట్‌ల హెల్ప్‌తో...

అతీక్ అహ్మద్ హత్యలో నిందితులకు సహకరించిన ముగ్గురుని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు లవ్‌లేష్ తివారి, అరుణ్ మౌర్య, సన్నీ సింగ్ అతిక్‌ను హత్య చేసే రోజు రిపోర్టర్‌లు నటించారు. ఉదయం నుంచి టీవీ కెమెరాలు, మైక్‌లతో డ్రామా చేశారు. అయితే..వీరికి ముగ్గురు రిపోర్టర్‌లు సహకరించినట్టు పోలీసులు వెల్లడించారు. స్థానికంగా ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌లో పని చేస్తున్న ముగ్గురు జర్నలిస్ట్‌లు  నిందితులకు హత్య చేయడంలో సహకరించారు. కెమెరా కొనుగోలు చేసేందుకూ హెల్ప్ చేశారు. అంతే కాదు. జర్నలిస్ట్‌లుగా ఎలా ఉండాలో కూడా వీళ్లే నిందితులకు నేర్పించారు. రిపోర్టింగ్‌లో క్రాష్ కోర్స్ చేశారు కిల్లర్స్. యూపీలోని బందా రైల్వే స్టేషన్‌లో ఆ ముగ్గురు జర్నలిస్ట్‌లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగి విచారణ చేపడుతోంది. అతిక్ అహ్మద్ భార్య ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. 

"అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్ కోసం గాలింపు చేపడుతున్నాం. కొందరు క్రిమినల్స్ మా కళ్లు గప్పి తిరుగుతున్నారన్న సమాచారం అందింది. అందుకే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాం. దాదాపు 2 గంటల పాటు గాలించాం. డ్రోన్ కెమెరాలతోనూ నిఘా పెడుతున్నాం. కానీ ప్రస్తుతానికి ఆ క్రిమినల్స్ ఎక్కడున్నారన్నది తెలియలేదు"

- యూపీ పోలీసులు 

ప్లాన్ ప్రకారం..

ముగ్గురు నిందితులు చాలా ప్రీప్లాన్డ్‌గా ఈ మర్డర్ చేసినట్టు విచారణలో తేలింది. హత్య చేయాలని ప్లాన్ చేసిన వెంటనే పోలీసుల దగ్గరి వరకూ వెళ్లాలంటే ఏం చేయాలని ఆలోచించారు. జర్నలిస్ట్‌లకైతే ఈజీ యాక్సెస్ ఉంటుందని అదే వేషంలో వచ్చారు. ఎక్కడా అనుమానం రాకుండా ఫేక్ ఐడీ కార్డులు తయారు చేసుకున్నారు. వెంట ఓ కెమెరా కూడా తెచ్చుకున్నారు. జర్నలిస్ట్‌లు ఎలా బిహేవ్ చేస్తున్నారు..? డౌట్ రాకుండా ఎలా కవర్ చేసుకోవాలి..? అని తెలుసుకున్నారు. అతిక్‌పైనా ఓ కన్నేసి ఉంచారు. మీడియాతో ఎలా మాట్లాడుతున్నాడో గమనించారు. కరెక్ట్ టైమ్ కోసం వేచి చూశారు. ఎప్పుడైతే ప్రయాగ్‌ రాజ్‌లోని హాస్పిటల్‌కి అతిక్‌, అష్రఫ్‌లను తీసుకొచ్చారో వెంటనే అలెర్ట్ అయ్యారు. మీడియా వాళ్లు చేసినట్టే హడావుడి చేశారు. నీట్‌గా టక్ చేసుకుని ఐడీ కార్డులు మెడలో వేసుకున్నారు. గన్స్ మాత్రం టక్‌ లోపల దాచేశారు. అతిక్‌ దగ్గరకు వెళ్లి ఏదో ప్రశ్న అడుగుతున్నట్టుగా నటించి వెంటనే షర్ట్‌లోపల నుంచి తుపాకీ తీసి కాల్చేశారు. నేరుగా అతిక్‌ తలకే గురి పెట్టి షూట్ చేశారు. ముగ్గురు నిందితులు దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక్కడ మరో డౌట్ ఏంటంటే పోలీసులు ఈ నిందితులపై అసలు కాల్పులే జరపలేదు. అతిక్, అష్రఫ్ స్పాట్‌లోనే ప్రాణాలొదిలారు. ఆ తరవాత ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి ఫేక్ మీడియా ఐడీ కార్డులు, మైక్రోఫోన్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పులు జరిపే క్రమంలోనే ఓ నిందితుడికి కాల్లోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. 

Also Read: Heatwave in India: నిప్పులు చెరుగుతున్న సూరీడు, 90% ప్రాంతాలు హైరిస్క్‌లో ఉన్నాయంటున్న రిపోర్ట్

Published at : 20 Apr 2023 12:14 PM (IST) Tags: UP Police Atiq Ahmed Murder Atiq Ahmed Case Reporters Arrest Atiq Ahmed Killers

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, పలువురికి గాయాలు

Odisha Train Accident: ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, పలువురికి గాయాలు

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Vizianagaram Crime News : ఇలాంటి తల్లులు కూడా ఉంటారు - విజయనగరంలో ఆ పాప బయటపడింది !

Vizianagaram Crime News : ఇలాంటి తల్లులు కూడా ఉంటారు  - విజయనగరంలో ఆ పాప బయటపడింది !

Mexico Crime: 45 బ్యాగ్‌లలో కుళ్లిన శరీర భాగాలు, చూసి వణికిపోయిన స్థానికులు

Mexico Crime: 45 బ్యాగ్‌లలో కుళ్లిన శరీర భాగాలు, చూసి వణికిపోయిన స్థానికులు

Gold Smuggling: శ్రీలంక నుంచి భారత్ కు బంగారం తరలింపు - నడిసంద్రంలో 32 కిలోల గోల్డ్ సీజ్ 

Gold Smuggling: శ్రీలంక నుంచి భారత్ కు బంగారం తరలింపు - నడిసంద్రంలో 32 కిలోల గోల్డ్ సీజ్ 

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా