Guntur Crime News: కోటీశ్వరుడినంటూ నమ్మంచి పెళ్లి పేరుతో మోసాలు - వైద్యురాలు బాధితురాలే!
Guntur Crime News: అందమైన ఫొటోలు మ్యాట్రిమొనీ సైట్లలో పెట్టి, కోటీశ్వరుడినంటూ చెప్పాడు. అందినకాడికి దోచుకుంటూ అమ్మాయిలను మోసం చేశాడు. కానీ చివరకు పాపం పండి పోలీసులకు పట్టుబడ్డాడు.
Guntur Crime News: మ్యాట్రిమొనీలో అందమైన ఫొటోలు పెడ్తాడు. తనకు వంద కోట్ల ఆస్తి ఉందంటూ మాయ మాటలు చెప్తాడు. నమ్మి ఎవరైనా ఇతడిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారంటే ఇక అంతే సంగతులు. అందినకాడికి వారి దగ్గర నుంచి దోచేస్తుంటాడు. చివరకు మొఖం చాటేస్తాడు. ఇలాగే లక్షలు కాజేసిన నిందితుడు... విమానం ఎక్కి దేశం దాటే ప్రయత్నం చేశాడు. కానీ ఇతగాడి పాపం పండి పోలీసులకు చిక్కాడు.
అసలేం జరిగిందంటే..?
గుంటూరుకు చెందిన ఓ యువతి లండన్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు వివాహం చేయాలని తల్లి ప్రయత్నాలు చేస్తోంది. విషయం తెలిసుకున్న హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు.. తాను పెళ్లి చేసుకుంటానని, వంద కోట్ల ఆస్తి ఉందని... లక్షల్లో జీతం వస్తోందని మాయ మాటలు చెప్పాడు. గుంటూరులో ఇల్లు కొనేందుకు కోటి రూపాయలు పంపుతానని చెప్పాడు. ఇందుకోసం ముందుగా తమ మధ్య బ్యాంకు లావాదేవీలు జరగాలని వివరించాడు. అలా విడతల వారీగా 25 లక్షల రూపాయలు జమ చేయించుకున్నాడు. ఇల్లు కొనే ప్రక్రియలో భాగంగా యజమాని డబ్బులు అడిగారు. ఇలా ఒక్కసారిగా కోటి రూపాయలు ఇవ్వకూడదని.. ముందు తన ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు పంపాలి అనగా... అందరికీ అనుమానం వచ్చింది.
వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టి మరీ నిందితుడిని పట్టుకున్నారు. ఈ మోసగాడు ఇదే తరహాలో 20 రోజుల కిందట విశాఖలో ఓ వైద్యురాలిని పెల్లి చేసుకొని.. మళ్లీ పెళ్లికి సిద్ధం అయినట్లు గుర్తించారు. గతంలో కూడా మాయ మాటలు చెప్తూ... చాలా మంది యువతులను మోసం చేసినట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశామని.. త్వరలోనే రిమాండ్ కు కూడా తరలిస్తామని పోలీసులు చెప్పారు.
ప్రేమించి మోసపోయానంటూ యువకుడి ఆత్మహత్య
విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించి మోసపోయానని సూసైడ్ లెటర్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ సలామ్ సూసైడ్ లెటర్ లో ఇలా రాశాడు. ఓ యువతి ప్రేమించి వంచిందని వాపోయాడు. తనను ప్రేమించిన యువతి ప్రవర్తనలో కొంతకాలంగా మార్పు వచ్చిందని తీరా ఆరా తీస్తే పెళ్లైన వ్యక్తితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ రిలేషన్ లో ఉందని తెలిసిందన్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని సలామ్ తెలిపాడు. ఆ యువతి ప్రవర్తన మారుతుందని ఎంత ప్రయత్నించినా మారడంలేదని, దీంతో తాను సరిగా చదవలేకపోతున్నానని రాశాడు. అన్నీ వదిలేయమని చెప్పినా వినకుండా అర్థరాత్రుళ్లు మరో వ్యక్తితో వీడియో కాల్స్ మాట్లాడుతుందని సలామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ టైమ్ పాస్ ప్రేమతో తనను పిచ్చివాడ్ని చేసిందన్నాడు. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని సలామ్ లెటర్ లో రాశాడు. తనలాంటి మోసపోయిన అబ్బాయిలకు న్యాయం చేయాలని సలామ్ వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టైమ్ పాస్ ప్రేమతో
విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని సూసైడ్ నోట్ లో సలామ్ రాశాడు. యువతి టైమ్ పాస్ ప్రేమతో తాను పిచ్చోడిని అయ్యానని, జీవితం మీద విరక్తితో తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నానని వాపోయాడు. సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటించిందని, పెళ్లైన ఓ లెక్చరర్‌తో సంబంధం పెట్టుకుని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేదని తెలిపారు. అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరని సలామ్ లేఖలో రాశాడు. సుకుమిక చేతిలో మోసపోయిన తనలాంటి అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ సలామ్ లేఖలో కోరారు.