Anantapur News: ఇంటి నిర్మాణం కోసం చోరీలు -అనంత పోలీసులకు చిక్కిన ఎలక్ట్రిషియన్
Anantapur Crime News : పొలంలో పెట్టిన ట్రాన్స్‌ఫార్మర్స్‌ను దొంగిలించే వ్యక్తిని అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. తన ఇంటి నిర్మాణం కోసం ఈ చోరీలు చేశాడు.

Anantapur Police: పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ఇల్లు కట్టాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకే ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం ఇతరుల ఇంటికే కన్నాలు వేయడం మొదలు పెట్టాడు. తనకు తెలిసిన ఎలక్ట్రీషియన్ వృత్తిని ఆధారంగా చేసుకొని ఈ చోరీలకు తెరశాడు. మరో నలుగురిని కలుపుకొని దోపిడీకి స్కెచ్ వేసి పోలీసులకు చిక్కాడు.
రాఘవేంద్రది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం నూతిమడుగు గ్రామం. ఇతను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. కొన్ని రోజుల క్రితం ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. డబ్బులు లేక అది సవ్యంగా సాగడం లేదు. ఎలక్ట్రీషియన్‌గా వచ్చే డబ్బులు ఇంటిని పూర్తి చేయడానికి సరిపోవు. అందుకే సులువుగా డబ్బు సంపాదనపై ఫోకస్ చేశాడు. తనకు తెలిసి వృత్థి ఆధారంగానే చోరీలు చేయాలని డిసైడ్ అయ్యాడు.
Also Read: భార్య అక్రమ సంబంధం - అత్త తల నరికేసి భార్య ప్రియుడికి గిఫ్ట్ - ఈ భర్త చాలా వయోలెంట్ !
తెలిసిన ఐదుగురి సాయంతో చోరీలకు ప్లాన్ చేశాడు. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి. అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. ప్రధానంగా తను ఉండే ప్రాంతంలో పెద్ద ఎత్తున బోరు బావులు కిందే పంటలు సాగు అవుతాయి. అందు కోసం రైతులు పెద్ద ఎత్తున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల బిగిస్తుంటారు. విద్యుత్ సరఫరా ఆపేసి ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసి తీసుకెళ్తారు.
ఈ మధ్య కాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ ఎక్కువైంది. వచ్చే ఫిర్యాదులు కూడా చాలా ఉన్నాయి. అందుకో పోలీసులు రంగంలోకి దిగి వీళ్ల ఆటగట్టించారు. ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు.
నిందితుల్లో ఓ ఎలక్ట్రిషన్ :
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కీలకమైన నిందితుడు రాఘవేంద్ర ఇతను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. విద్యుత్ శాఖ స్థానిక అధికారులకు మరియు హెల్పర్లకు సపోర్టర్ వర్క్‌గా వెళ్లేవాడు. పని ఉన్న రోజు ఇతనికి కూలిచేవారు. అది జీవనానికే సరిపోయేది కాదు. అంతలోనే సొంత ఇల్లు కట్టుకోవాలని చిరకాల కోరిక ఉండేది. అందుకే ట్రాన్స్ఫార్మర్ల రిపేర్‌లో అనుభవంతో రాగి, అల్యూమినియం వైర్లు తస్కరంచేవాడు.
విద్యుత్ బిల్లులు తీసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులైన చిరంజీవితోపాటు పదవిలో ఉన్న వాసు రాఘవేంద్రకు సహకరించాడు. ఇతనిపై రౌడీషీటర్ కూడా ఉంది రాఘవేంద్ర చిరంజీవి పరంధాములకు, వన్నూరు స్వామి ఎర్రి స్వాములు తోడయ్యారు ఈ ముగ్గురు కూడా విద్యుత్ శాఖలకు సపోర్టరుగా వెళ్లేవారు. ముందుగా దొంగతనం చేయుటకు అనువైన ప్రదేశంలో ఉంచే వాళ్లు. అక్కడే రాగి వైరు తొలగించేవాళ్లు. దాన్ని వైర్లను హైదరాబాదు, బళ్లారి విక్రయించేవారు.
నలుగురు అరెస్ట్
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో నలుగురు నిందితులను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన 450 కిలోల రాగివైర్లు, 180 కిలోల అల్యూమినియం వైర్లు స్వాధీనం పోలీసులు చేసుకున్నారు.
Also Read: ముంబయి తీరంలో బోటు ప్రమాదం, 13 మంది మృతి - 101 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్





















