Auto Driver Fraud : వృత్తి ఆటోడ్రైవర్ - చేసింది రూ. 360 కోట్ల ఫ్రాడ్ ! వీడు మామూలోడు కాదు..
ఐటీ కంపెనీని నడుపుతున్నానని చెప్పి ప్రజల్ని రూ. 360 కోట్లకు ముంచేశాడు ఓ అహ్మదాబాద్ ఆటో డ్రైవర్ . ఆర్వోసీ అధికారులు స్కాంను గుర్తించే వరకూ ఎవరూ కనిపెట్టలేకపోయారు.
అతడో ఆటో డ్రైవర్. అహ్మదాబాద్‌లో ఆటో నడుపుతూ ఉంటాడు. కానీ హఠాత్తుగా మాయమైపోయాడు. ఏమైపోయాడో.. ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. కానీ అహ్మదాబాద్ పోలీసులు ఓ రోజు అతన్ని,అతని భార్యను పట్టుకుని వచ్చారు. కోర్టులో ప్రవేశ పెట్టారు. అతడు ఏం చేశాడో.. నేరం గురించి బయటకు తెలిసిన తర్వాత అందరూ నోరెళ్లబెట్టారు. ఎందుకంటే.. అతను నడిపింది ఆటోనే కానీ.. చేసిన మోసం మాత్రం ఎరోప్లేన్ అంతది. ఏకంగా రూ. 360 కోట్లను అమాయకుల దగ్గర్నుంచి కొట్టేశాడు.
అండర్‌వేర్‌తో ఉంది కాబట్టి అత్యాచారం జరగలేదన్న రేపిస్ట్ - మేఘాలయ కోర్టు తీర్పు ఎలా ఉందంటే ?
అహ్మదాబాద్‌కు చెందిన విజయ్ వంజర ఆటో డ్రైవర్. భార్య మమతతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఈ ఆటో లైఫ్‌తో ఎంత కాలం అనుకున్నాడేమో కానీ ఓ ఐటీ కంపెనీ పెట్టేశాడు. రూ.పది వేల పెట్టుబడితో తన కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ ఐటీ కంపెనీస్‌లో రిజిస్ట్రేషన్ చేయించేశాడు. ఆ తర్వాత మాయమైపోయాడు. ఏం చేశాడంటే...తన కంపెనీలో పెట్టుబడి పెడితే.. పెట్టుబడి నెలల్లోనే రెట్టింపు అవుతుందని ప్రచారం చేశాడు. ఇలా అమాయకుల దగ్గర పెట్టుబడులు తీసుకున్నాడు. ఇలా అతను తీసుకున్న .. వసూలు చేసిన మొత్తం ఏకంగా రూ. 360 కోట్లు. ఐటీ కంపెనీ అంటే అహ్మదాబాద్‌లో ఉంటే నమ్మరని..బెంగళూరుకు షిప్ట్ అయిపోయాడు.
సినిమా టికెట్ చూపిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు, అసోం సీఎం బంపర్ ఆఫర్
ఆన్‌లైన్‌లో ఇలా మోసం చేసి అందర్నీ నమ్మించి పెట్టుహడులు సేకరించాడు. రేజర్ పే ద్వారా డబ్బులు సేకరించారు. అయితే పెట్టుబడిదారులకు అనుమానం రాలేదు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులకే ్నుమానం వచ్చింది. ఆరా తీశారు. చివరికి బండారం బట్టబయలు అయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ నగదు లావాదేవీలను గుర్తించి... విజయ్ వంజర..అతని భార్యతో పాటు అతనికి ఈ నేరంలో సహకరించిన వారెవరో గుర్తించి.... అరెస్ట్ చేశారు. విజయ్ వంజరపై గతంలోనూ మోసం కేసులు ఉన్నట్లుగా గుర్తించారు.
కంపెనీలను రిజిస్టర్ చేసి.. పెట్టుబడుల పేరుతో జనాల్ని మోసం చేయడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. కంపెనీ ఏమిటో.. ఏం చేస్తుందో కూడా తెలియకుండా... కొద్ది మొత్తకమే కదా అని ఐదువందల నుంచి రూ. పది వేల వరకూ పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఆ డబ్బులు తిరిగి రావడం గగనంగా మారింది. చివరికి దొరికిన వాళ్లు మాత్రమే దొరుకుతున్నారు. వారుదొరికినా.. కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్‌పై వచ్చి జల్సా చేస్తున్నారు. కానీ మోసపోయిన వారికి మాత్రం డబ్బులు తిరిగి రావడం లేదు.