Rape Case : అండర్‌వేర్‌తో ఉంది కాబట్టి అత్యాచారం జరగలేదన్న రేపిస్ట్ - మేఘాలయ కోర్టు తీర్పు ఎలా ఉందంటే ?
రేప్ కేసుల్లో సాంకేతిక అంశాలతో బయటపడేందుకు నిందితులు ప్రయత్నిస్తూంటారు. అలాంటి వారికి షాకిచ్చే తీర్పు మేఘాలయ హైకోర్టు ఇచ్చింది.
రేప్ చేసినప్పుడు ఆమెకు నొప్పిగా అనిపించలేదని.. అదే సమయంలో ఆమె అండర్ వేర్ కూడా ధరించిందని.. పైగా ఆమె తాను రేప్ చేశానని చెప్పలేదని ...ఈ కారణంగా తాను రేప్ చేశానన్న మాట అబద్దమని కోర్టులో వాదించి బయటపడాలనుకున్నాడు ఓ రేపిస్ట్. కానీ న్యాయస్థానం మైండ్ బ్లాంక్ అయ్యేలా తీర్పు ఇచ్చింది. మేఘాలయాలో 2006లో ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదయింది. ఈ కేసులో అత్యాచార బాధితురాలైన బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. రేపిస్ట్ నేరాన్ని నిర్ధారించిన ట్రయల్ కోర్టు పదేళ్ల శిక్ష విధిచింది. అయితే నిందితుడు.. తన వాదనతో హైకోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్‌లో కొన్ని సాంకేతిక పరమైన అంశాలను ఆసరాగా చేసుకుని బయటపడాలనుకున్నాడు.
నేరం జరిగిందని చెబుతున్న సమయంలో అత్యాచార బాధితురాలు అండర్ వేర్ ధరించి ఉందని.. అదే సమయంలో ఆమె ఎలాంటి బాధ అనుభవించలేదన్నారు. ఈ విషయాలు మెడికల్ రిపోర్టులో కూడా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ శిక్షాస్మృతి ( IPC )లోని సెక్షన్ 375 ( బి ) ప్రకారం యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా వస్తువును ఉంచితే అది అత్యాచారం అవుతుంది. అయితే ఇక్కడ బాధితురాలు నొప్పికి గురవలేదని.. అండర్ వేర్ ధరించి ఉన్నందున అలాంటిదేదీ జరగలేదని... బాధితురాలు తనపై అత్యాచారం జరగలేదని చెప్పిందని నిర్ధారించలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బాలిక వయసు పదేళ్లేనని గుర్తు చేశారు. అత్యాచార బాధితురాలి మెడికల్ రిపోర్టులో ఆమె అత్యాచారానికి గురైందని ఉందని చేసింది. అమె జననాంగాల్లో గాయాలు ఉన్నాయని, బాలిక అత్యాచారానికి గురై మానసికంగా ఇబ్బంది పడుతోందని వైద్య పరీక్షల్లో నిర్దారించారు. దీంతో అత్యాచార నిందితుడు తప్పుడు వాదన వినిపిస్తున్నాడని మేఘాలయ హైకోర్టు నిర్ధారించింది.
బాధితులు ఇచ్చే సాక్ష్యాలను తప్పని సరిగా పరిశీలించాలని ఈ సందర్భంగా మేఘాలయ హైకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది. వారి విద్య , ఆలోచనల స్థాయి , వయసు అన్నింటినీ పరిగణనలోకి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలో అనేక మంది అత్యాచార నిందితులు సాంకేతిక విషయాలను అడ్డం పెట్టుకుని కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారందరికీ షాకిచ్చేలా మేఘాలయ హైకోర్టు తీర్పుఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేప్ కేసుల్లో కొన్నింటినీ నిర్దారించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని బయటపడాలనుకునేవారికి మేఘాలయ హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని అనుకోవచ్చు.