అన్వేషించండి

The Kashmir Files: సినిమా టికెట్‌ చూపిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు, అసోం సీఎం బంపర్‌ ఆఫర్

The Kashmir Files movie: ది కాశ్మీర్‌ ఫైల్స్ సినిమా కోసం అసోం ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సినిమా చూసి టికెట్ చూపిస్తే సెలవు ఇస్తామని తెలిపారు ఆ రాష్ట్ర సీఎం

The Kashmir Files movie: ది కశ్మీర్ ఫైల్స్...ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా అయిపోయినా సీట్లలో నుంచి కదల్లేక కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్లు....వందేమాతరం అంటూ తమ దేశభక్తిని చాటుకుంటున్నవాళ్లు..జై శ్రీరామ్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నవాళ్లు. కశ్మీర్ ఫైల్స్ ఆడుతున్న థియేటర్ల దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఇవే.  

అసోం బంపర్ ఆఫర్

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమాకు రాయితీలు ప్రకటించాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు అసోం రాష్ట్రం అంతుకు మించి అన్నట్టు మరో ఆఫర్ ప్రకటించింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటిచింది అక్కడి ప్రభుత్వం. ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా చూస్తామన్న ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్‌ ఇస్తున్నట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. సినిమా చూసిన వాళ్లు తమ ఉన్నతాధికారికి సమాచారం ఇవ్వాలని... టికెట్లు కూడా సమర్పించాలని ప్రకటించారు. 

The Kashmir Files: సినిమా టికెట్‌ చూపిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు, అసోం సీఎం బంపర్‌ ఆఫర్

నిధానంగా ప్రారంభమై సునామీలా

ఐడీఎంబీ లో ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ అని ఫిల్మ్ గా నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచిన  ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ఓపెనింగ్ డే మాత్రం అనుకున్నంతగా సాగలేదు. దేశవ్యాప్తంగా పరిమిత స్క్రీన్లలో మాత్రమే విడుదలైన కశ్మీర్ ఫైల్స్ మొదటి రోజు మూడున్నర కోట్ల రూపాయల మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ రెండో రోజు నుంచి రోజురోజుకు స్క్రీన్లను పెంచుకుంటూ....కలెక్షన్ల సునామీనే సృష్టిస్తోంది అని చెప్పాలి. 

వివేక్‌ రా కంటెంట్‌

ఇంతకు ముందు తాష్కెంట్ ఫైల్స్ తీసిన వివేక్ అగ్నిహోత్రి డైరక్షన్ లో అంతే రా గా రస్టిక్ గా...వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా కశ్మీర్ ఫైల్స్.అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి లాంటి యాక్టర్స్ తమ పాత్రలకు జీవం పోస్తే...సినిమాను చూసిన ప్రేక్షకులు ఆ ఎమోషన్ తో గుండెలు అవిసిపోయేలా ఏడుస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఈ స్థాయిలో ఎమోషనల్ గా కదిలించిన సినిమా మరోటి లేదేమో. ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. సినిమా టీమ్ ప్రధాని మోదీ పిలిచి స్వయంగా అభినందించారు. ఇంతలా దేశం మొత్తం డిబేటబుల్ గా మారిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్. 

అసలు ఈ సినిమాకు బ్యాక్ డ్రాప్ పాయింట్ గా నిలిచిన కశ్మీరీ పండిట్ల అంశం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరీ కశ్మీరీ పండిట్లు....ఇన్ని కోట్ల మంది ప్రేక్షకులు వాళ్లకు జరిగిన అన్యాయం పట్ల థియేటర్లలో కూర్చుని సినిమా అనే విషయాన్ని మర్చిపోయి మరీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే జరిగింది ఏంటీ.

అసలు ఎవరీ కశ్మీరీ పండిట్లు...

కశ్మీరీ పండిట్లు....కశ్మీర్ లోయ ప్రాంతానికి చెందిన కశ్మీరీ బ్రాహ్మణులు. సారస్వత బ్రాహ్మణ కమ్యూనిటీ కి చెందిన ముస్లిం పాలకుల దండయాత్ర ముందు వరకూ కశ్మీర్ లోయల్లో మెజారిటీ వర్గం. ప్రధానంగా తుర్క్ మెనిస్థాన్ నుంచి జరిగిన దాడుల కారణంగా కశ్మీరీ పండిట్లు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోయే పక్రియ ప్రారంభమైంది. కొంత మంది మాత్రం కశ్మీరీ పండిట్లను గౌరవంగా చూసుకునేవారు. 14వ శతాబ్దం నాటికి కశ్మీరీ పండిట్లు Guru అంటే అర్చకులు, పూజారులు(priests), Jotish అంటే జ్యోతిష్కులు (astrologers), Kārkun అనే మూడు ప్రధాన కమ్యూనిటీలుగా విడిపోయారు. ఈ కార్కూన్స్ ప్రధానంగా సుల్తాన్ ల ఆస్థానంలో కీలక పదవుల్లో ఉండేవారు.

అప్పట్లో అలా

1423-74 వరకూ కశ్మీర్ ను పరిపాలించిన ఎనిమిదో సుల్తాన్ గియాజుద్దీన్ జైనలుబ్దీన్ మాత్రం కశ్మీర్ పండిట్లకు చాలా గౌరవమిచ్చేవారు. వారిని, బౌద్ధమతం ఆచరించే వారిని తన ఆస్థానంలో కీలకపదవుల్లో ఉంచారు. అంతే కాదు అంతకు ముందు సుల్తాన్ ల బెదిరింపులతో ఇస్లాంలోకి మారిన కశ్మీరీ పండిట్లను తిరిగి తమ మతంలోకి వెళ్లేందుకు అనుమతిచ్చారు. హిందూ ఆలయాల పునరుద్ధరణకు పెద్దమొత్తంలో నిధులు ఇచ్చారు. దీంతో కశ్మీరీ పండిట్లు తమ చరిత్రలో మొదటి అవరోధాన్ని తప్పించుకోగలిగారు. వారికి ఉన్న అపార పాండిత్యం కారణంగా పండిట్ అని గౌరవంగా పిలవటం కూడా ప్రారంభమైందంటారు.

1947 తర్వాత తారుమారు

తిరిగి 1846-1947 వరకూ కశ్మీరీ పండిట్లు అప్పుడప్పుడు తమ కమ్యునిటీకి ముప్పును ఎదుర్కొన్నా కశ్మీర్ లోయ ప్రాంతాల్లో వారిదే మెజారిటీ వర్గం. 1947 వరకూ కశ్మీర్ లో డోగ్రా రూల్ సాగింది. అప్పటివరకూ కశ్మీరీ పండిట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 1950లో అప్పటి నెహ్రూ ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల ప్రభావం కశ్మీర్ లోయలపై పడింది. చాలా మంది కశ్మీరీ పండిట్లు నిర్వాసితులయ్యారు. దాదాపు 20శాతం మంది కశ్మీరీ పండిట్లు  వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 1980నాటికి మొత్తం జనాభాలో 5 శాతానికి కశ్మీరీ పండిట్లు పడిపోయారు. ఫలితంగా వారికి మైనార్టీ హోదా వచ్చింది. అల్పసంఖ్యాక వర్గం గా హిందూ కమ్యూనిటీ ఉండే ప్రాంతం ఒకటి  ఇండియాలో ఉంటుందని ..అది కశ్మీర్ అవుతుందని బహుశా ఎవరూ ఊహించి కూడా ఉండరు.

అసలు ముప్పు 1990ల్లోనే 

కానీ కశ్మీరీ పండిట్లకు అసలు ప్రమాదం మొదలైంది 1990ల్లోనే. కశ్మీర్ లోయల్లో వేర్పాటు వాదం బాగా బలిపడింది. మిలిటెంట్లు, రాడికల్ ఇస్లామిక్ శక్తులు తమ బలాన్ని అమాంతం పెంచుకున్నాయి. ముందు మైనార్టీలుగా కశ్మీర్ లో బతుకుతున్న కశ్మీరీ పండిట్లను అణిచివేసే ప్రక్రియ మొదలైంది. 1990 జనవరి 19 న కశ్మీర్ లో మసీదుల్లో కశ్మీర్ పండిట్లను కాఫిర్లు గా ప్రకటించారు. కాఫిర్ అంటే అరబిక్ లో ఇస్లాం మతాన్ని, దేవుడిని నమ్మనివాడు అని అర్థం. కశ్మీరీ పండిట్ల సంఖ్య తక్కువ కావటంతో వాళ్లను చాలా సులభంగా గుర్తించేవారు. వాళ్ల ముందు మూడే ఆప్షన్లు పెట్టేవారు. ఒకటి కశ్మీర్ విడిచి పోవటం రెండు ఇస్లాంలోకి కన్వర్ట్ అవటం...మూడు ప్రాణాలు విడిచేయటం. కశ్మీర్ విడిచి పోవాలని నిర్ణయించుకుని చాలా మంది వెళ్లిపోయే వాళ్లు తమ ఇంట్లో ఆడవాళ్లను విడిచి పెట్టి వెళ్లాలనే ఆంక్షలు పెట్టారు. ఇప్పటికీ నాటి సంగతులను తలుచుకుని వణికిపోయే వాళ్లు ఉన్నారు. ఆ పరిస్థితుల ను ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారి లెక్కే లేదు. 90ల్లో లక్షా 40వేల మంది కశ్మీరీ పండిట్లలో లక్షమంది కశ్మీర్ ను వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారని అంచనా. అప్పటి ప్రభుత్వాలు వేర్పాటు వాద శక్తులకు భయపడి కశ్మీరీ పండిట్లను విస్మరించారనేది చరిత్ర చెబుతోంది.

భయం వీడని పండిట్లు

ఆ తర్వాత కశ్మీరీ పండిట్ల అంశం రాజకీయాలకు వేదికగా మారింది. యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక తొలిసారి కశ్మీరీ పండిట్లను కశ్మీర్ కు తిరిగి తెప్పించే ప్రయత్నాలు చేసింది. కానీ ప్రాణాలతో ఉండగలమనే ధైర్యం కల్పించలేకపోయింది. కశ్మీరీ పండిట్ల కోసం జమ్ము లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేటికీ వాటికే అంటిపెట్టుకుని మాతృభూమికి దూరంగా అన్నీ ఉన్నా అనాథల్లా బతుకుతున్న వారెందరో. 

నేటికీ అదే భయం 

2014లో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే గవర్నమెంట్ ఏర్పడ్డాక కశ్మీరీ పండిట్ల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఏప్రిల్ 2018 లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు తీసేయటంలో పూర్తిస్థాయిలో కేంద్రం అక్కడి పరిస్థితులపై దృష్టి సారించగలిగింది. కశ్మీర్ పండిట్లు తిరిగిరావాలని కోరుతూ ప్రధానమంత్రి పునరావాస ప్యాకేజీలలను ప్రకటించారు. కానీ నాటి భయం నేటికీ కశ్మీరీ పండిట్లను వెంటాడుతోంది. 

డైరెక్టర్‌పై ప్రశంసలు

ఇన్ని జరిగినా ప్రాణాలు పోయినా పర్లేదు అని....కశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 3000 మంది దాకా కశ్మీరీ పండితులు ఉన్నారని సమాచారం. కశ్మీరీ పండితుల కోసం అక్కడ ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తే బయటకు వెళ్లిన వారంతా తిరిగి రావొచ్చని వారు భావిస్తున్నారు. కశ్మీర్‌లో ఓ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసి అక్కడ మెజారిటీ కశ్మీరీ పండిట్లకు నివాసం కల్పిస్తే వెనక్కి వెళ్లిన వారంతా తిరిగి తమ జన్మభూమిని చేరుకుంటారని నేటికీ కోరుతుంటారు కశ్మీరీ పండిట్లు. సో ఇది కశ్మీరీ పండిట్ల చుట్టూ జరిగింది. అందుకే కశ్మీరీ ఫైల్స్ చూసిన వాళ్లంతా అంత ఎమోషనల్ అవుతున్నారు. ఇన్నాళ్ల తర్వాత ధైర్యం చేసి ఓ వ్యక్తి నిజం చెప్పాడంటూ డైరెక్టర్ అగ్నిహోత్రిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget