IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Rape on Cow: కొత్త ఇంట్లోకి ఆవును తీసుకొచ్చి అత్యాచారం - గొంతుకు బిగుసుకున్న ఉరి, చివరికి

Nirmal: నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో హిందువులు పవిత్రంగా భావించే ఆవుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన జరిగింది.

FOLLOW US: 

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు మనిషి, పశువు అన్న బేధం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమ వాంఛ తీర్చుకునేందుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. గతంలో పశువులపై ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ఆఖరికి కుక్కపైన కూడా అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్‌లోనే కొద్ది నెలల క్రితం వెలుగు చూసింది. కానీ, తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆవు ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానవీయ దారుణ ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో హిందువులు పవిత్రంగా భావించే ఆవుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆవు అక్కడిక్కడే మరణించింది. ఆవుకు కట్టిన తాడు దాని గొంతుకు బిగుసుకొని ఉరి పడింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. 

నిర్మల్ జిల్లా పిప్రి గ్రామానికి చెందిన రావుల సాయన్న అనే రైతు కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాడు. ఇంట్లో మార్బుల్స్ వేయిస్తున్నాడు. అందుకోసం ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మార్పుల్స్ వేసే కూలీలను పిలిపించాడు. వీరిలో విజయ్‌ అనే యూపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. మార్బుల్స్ పనిలో భాగంగా వారు పని అయ్యే వరకూ అక్కడే రాత్రి వేళ పడుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అందరూ నిద్రించిన అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

యజమాని సాయన్నకు చెందిన ఆవు కొట్టంలో కట్టేసి ఉంది. దాన్ని తాడుతో పాటు కొత్త ఇంట్లోకి తీసుకొచ్చి కిటికీ ఊచలకు తాడుతో కట్టాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో ఆవు ఎంతోసేపు అటు ఇటూ పెనుగులాడింది. కింద మార్బుల్స్ వేసి ఉండడంతో కాలు జారి కింద పడింది. దీంతో కిటికీకి కట్టిన తాడు ఆవు మెడకు బిగుసుకొని ఉరి ఏర్పడింది. ఆ విషయం గమనించని నిందితుడు తన పని కానిచ్చాడు. ఉరి గట్టిగా బిగుసుకోవడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. 

ఉదయం కొట్టంలో కట్టేసిన ఆవు కనిపించక పోవడంతో వెతికిన రైతుకు కొత్త ఇంట్లో ఆవు చనిపోయి కనిపించింది. అంతేకాక, రోజు కూలీ విజయ్‌ తీవ్రమైన అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా సదరు కూలీ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పశువుల వైద్యులు ఆవుకు పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

Published at : 01 Apr 2022 02:06 PM (IST) Tags: Adilabad Cow rape Nirmal Cow rape UP Man Rapes cow Lokeshwaram Pipri village Cow rape incident in Nirmal

సంబంధిత కథనాలు

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Kakinada News :  డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు,  పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో  - ఎవరికంటే?

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక