అన్వేషించండి

Adilabad: గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడి బీభత్సం, బ్లేడుతో పోలీసులపై దాడి

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితుడు బీభత్సం సృష్టించాడు.

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో ఓ నిందితుడు బీభత్సం సృష్టించాడు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. పోలీసు స్టేషన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే బ్లేడుతో పోలీసులపై దాడి చేశాడు. అనంతరం అదే బ్లేడుతో తన మెడపైనా గాట్లు వేసుకున్నాడు.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో బాలికను కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిహత్నూర్ కు చెందిన అరుణ్ అనే వ్యక్తి.. 17 ఏళ్ల బాలికను సోమవారం ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఆమెను రక్షించారు. మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. 

బుధవారం సదరు యువకుడిని పోలీసులు పిలవగా, ఇంటి నుంచి బ్లేడుతో వచ్చిన యువకుడు రిమాండ్ కు తరలిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న పోలీసులపై బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం తన మెడపై తానే కోసుకున్నాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అతడిని పట్టుకున్నారు. గాయపడ్డ ఆ ఇద్దరిని అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న పోలీస్ ఉద్యోగిపై హత్యాయత్నం చేసినందుకు మరో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్‌ ట్రైనర్‌

మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశారు జిమ్‌ ట్రైనర్‌ ఉపేందర్‌. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ  సంఘటన స్థానికంగా కలకలలం రేపింది. మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా కడుతున్న ఇంటికి బాలిక తల్లిదండ్రులు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అయితే.. సోమవారం పనిమీద  బయటకువెళ్లారు. ఇంటి దగ్గర బాలిక ఒక్కటే ఉంది. ఇంటి బయట ఆడుకుంటోంది. అదే కాలనీలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఉంపేదర్‌ బాలికను గమినించాడు.  

ఒంటరిగా ఉండటం చూసి.. ఎలాగైనా లోబరుచుకోవాలని ప్రయత్నించారు. చిన్నారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఆశ పెట్టాడు. జిమ్‌లోకి  తీసుకెళ్లాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా... చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని వయస్సు ఆ చిన్నారిది. అయినా  రెచ్చిపోయాడు కామాంధుడు ఉపేందర్‌. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 

ఇంతలో ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు... ఇంట్లో బాలిక లేకపోవడంతో అంతా వెతికారు. ఎక్కడా లేకపోవడంతో కంగారుపడ్డారు. అనుమానం వచ్చి పక్కనే ఉన్న జిమ్‌లోకి వెళ్లారు. అక్కడ బాలిక ఏడుస్తూ ఉండటం గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా... బాలిక విషయం వారితో చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. జిమ్‌ ట్రైనర్‌ ఉపేందర్‌(29)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. చిన్నారులను చిధిమేస్తున్న ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు పెరిగిపోతాయని... కఠిన శిక్షలు పడితేనే... మరో ఇలాంటి ఘాతుకాలకు తెగబడరని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget