అన్వేషించండి

ACB Raids In Tirupati: ఏసీబీ వలలో మరో అవినీతి చేప - 85 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండి సీజ్!

ACB Raids In Tirupati: తిరుపతి బీసీ వెల్ఫేర్ డీడీ యుగంధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా.. 850 గ్రాముల బంగారం, మూడున్నర కిలోల వెండి, కోటి 70 లక్షల నగదు పట్టుబడింది. 

ACB Raids In Tirupati: ఏసీబీ వలకు మరో చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తిరుపతి బీసీ వెల్ఫేర్ డీడీ ఆర్.యుగంధర్ ఇంట్లో అనంతపురం, తిరుపతి అవినీతి నిరోధక శాఖ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించింది. బుధవారం ఉదయం 6.25 నిమిషాల నుంచి డీడీ యుగంధర్ గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంటితో పాటు కార్యాలయం, మరో మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు అనంతపురం ఇంచార్జ్ ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. ఏసీబీ సోదాల్లో యుగంధర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినట్లు నిర్ధారణ అయిందన్నారు. కాకినాడలో రెండస్థుల భవనాలు రెండు, ఓ అపార్ట్మెంట్, ఐదు ఇళ్ల స్థలాలు ఉన్నాయని వాటికీ సంబంధిన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 


ACB Raids In Tirupati: ఏసీబీ వలలో మరో అవినీతి చేప - 85 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండి సీజ్!

విజయవాడ, తూర్పు గోదావరి ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని గుర్తించామని చెప్పారు. 850 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కేజీల వెండి ఆభరణాలు సీజ్ చేశామన్నారు. కేవలం తిరుమలలో దొరికిన ఆస్తుల విలువ కోటి 70 లక్షలు కాగా... మిగిలిన ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల విలువ ఇంకా తేలలేదని తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని... తనిఖీలు ముగిసిన అనంతరం మరిన్ని వివరాలు తెలుపుతామన్నారు.


ACB Raids In Tirupati: ఏసీబీ వలలో మరో అవినీతి చేప - 85 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండి సీజ్!

ఆరు నెలల కిందట సూళ్లూరుపేటలో.. 

ఏసీబీ అధికారులు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో హడావిడి పడ్డాడు మున్సిపల్ కమిషనర్. తన దగ్గర ఉన్న డబ్బుల కట్టల్ని కిటికీనుంచి బయటపడేశారు. మొక్కల్లో సంచి పడిపోయింది కదా తనను పట్టించుకోరని అనుకున్నారాయన. కానీ చివరకు ఏసీబీ ఆ సంచిని స్వాధీనం చేసుకుంది. సంచిలో ఉన్న 1.13 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కమిషనర్ కారులోని డ్యాష్ బోర్డ్ లో మరో 50 వేల రూపాయలు బయటపడింది. ఆయన బీరువాలో మరో 30 వేల రూపాయలు కూడా దొరికాయి. మొత్తం లక్షా 93 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్త సాధారణ తనిఖీల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కానీ పక్కా సమాచారంతోనే వారు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లారని తెలుస్తోంది. పంచాయతీ సెక్రటరీగా ఉంటూ ప్రమోషన్ మీద మున్సిపల్ కమిషనర్ అయ్యారు నాగిశెట్టి నరేంద్రకుమార్. గతంలో ఆయన వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత సూళ్లూరుపేట బదిలీపై వచ్చారు. 

బుధవారం ఉదయాన్నే ఏసీపీ అధికారులు సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో టీమ్ సూళ్లూరుపేట చేరుకుంది. మున్సిపల్ ఉద్యోగులను లోపల ఉంచి తలుపులు వేసి సోదాలు మొదలు పెట్టారు. కమిషనర్‌ నాగిశెట్టి నరేంద్రకుమార్‌ ఛాంబర్‌ లో పక్కనే కిటికీ ఉంది. ఏసీ ఉంటుంది కాబట్టి సహజంగా ఆ కిటికీ మూసేస్తారు. కానీ అధికారులు ఎంట్రీ ఇచ్చే సమయానికి కిటికీ తెరిచి ఉంది. దీంతో వారికి అనుమానం వచ్చింది. బయట కిటికీ దగ్గరకు వెళ్లి చూసే సరికి సంచిలో రూ.1.13 లక్షల నగదు ఉంది. దీంతోపాటు మరికొంత నగదుని కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ బృందం సోదాలు చేసింది. అప్పటి వరకూ బయటకు అధికారిక సమాచారం రాలేదు. ఆ తర్వాత అధికారికంగా ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని తెలిపారు ఏసీబీ సిబ్బంది. సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 110 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, 50 ఇళ్ల నిర్మాణాలు అనుమతులకు విరుద్ధంగా జరిగాయని గుర్తించారు అధికారులు. కమిషనర్‌ నరేంద్రకుమార్‌ సాధారణ పనిదినాల్లో రోజూ రాత్రి 8 గంటలకు వరకు ఆఫీస్ లోనే ఉంటారని, సెలవు రోజుల్లోనూ కష్టపడి పడనిచేస్తుంటారని సిబ్బంది చెబుతున్నారు. సెలవు రోజుల్లో కూడా ఇంత కష్టపడి పనిచేయడంపై స్థానికులకు అనుమానం వచ్చింది. నలుగురు వ్యక్తులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. ఈరోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget