Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Telangana News: తనను వేధింపులు గురి చేస్తున్నాడని ఓ మహిళ డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించింది. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది.

Woman Slaps on Deputy Tahasildar Cheek In Narayankhed: తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ అధికారి చెంప ఛెళ్లుమనిపించింది ఓ మహిళ. ఫోన్ లో ఫోటోలు తీస్తుండగా గుర్తించిన మహిళ తగిన బుద్ధి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారాయణఖేడ్ (Narayankhed) పట్టణంలోని ఓ ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ నివాసం ఉంటున్నారు. అయితే, పక్క పోర్షన్ లో ఉన్న ఓ మహిళ.. డిప్యూటీ తహసీల్దార్ తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ అతని చెంప పగలగొట్టింది. ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీసి వేధింపులకు గురి చేస్తున్నట్లు వాపోయింది. అనంతరం తన భర్తకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి భర్త డిప్యూటీ తహసీల్దార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని అందజేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడని.. అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024
నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది.
ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది. బాధితురాలు తన భర్తకు… pic.twitter.com/edXuPnRbWq
Also Read: Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత





















