Crime News : జోగయ్య పేరుతో వీహెచ్‌కు టోకరా వేసే ప్రయత్నం - కానీ కనిపెట్టేశారు !
జోగయ్య పేరుతో వీహెచ్‌కు టోకరా వేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. మాజీ ఎంపీ హర్షకుమార్ జోక్యంతో మోసం బయటపడింది. కానీ నిందితుడు మాత్రం దొరకలేదు.
Crime News : కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు కేటుగాళ్ల ఫోన్ చేశారు. హరిరామ జోగయ్య పేరిట బురడి కొట్టించే ప్రయత్నం చేశారు. 78010 96535 నంబర్ నుంచి హరిరామ జోగయ్య పేరిట ఫోన్ చేసి ఆపదలో ఉన్నాను అర్జెంట్ గా డబ్బులు పంపాలని వి.హెచ్ ను కేటుగాడు కోరాడు. 96521 96535 ఈ నంబర్ కు గూగుల్ పే చేయాలని విజ్ఞప్తి చేశాడు. హరిరామ జోగయ్య నంబర్ కాకపోవడంతో వీహెచ్.. మాజీ ఎంపీ హర్షకుమార్ ను సంప్రదించారు. హర్షకుమార్ ఓ వ్యక్తిని హరిరామ జోగయ్య ఇంటికి పంపి విహెచ్ విచారణ చేశాడు. ఫేక్ అని తేలడంతో వెస్ట్ గోదావరి ఎస్పికి ఫిర్యాదు చేశాడు. ఖమ్మం నుంచి ఫోన్ వచ్చినట్లు వెస్ట్ గోదావరి ఎస్పి చెప్పాడు. దీంతో ఖమ్మం ఎస్పి, సైబరాబాద్ పోలీస్ లకు వి.హెచ్ ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని హర్షకుమార్ సోషల్ మీడియాలో తెలిపారు. 7801096535 అనే నెంబర్ నుంచి మోసగాళ్లు ఫోన్ చేస్తున్నారని తెలిపారు. ట్రూకాలర్‌లో ఈ నెంబర్ కు స్కామర్ జగన్ అని చూపిస్తోందన్నారు. ఆ నెబర్ నుంచి కాల్ చేసిన తతర్వాత 9652196535 కి ఫోన్ పే చేయమంటారని తెలిపారు. గురువారం పై నెంబర్ నుంచి V. హనుమంతరావు రాజ్యసభ మాజీ సభ్యులు గారికి ఫోన్ చేసి చేగొండి హరిరామ జోగయ్య మాట్లాడుతున్నట్టు ఆయన్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతూ టాబ్లెట్స్ కి డబ్భులు లేవు 5,000 అర్జంట్ గా పంపమన్నాడు.ఆయన నాకు ఫోన్ చేసి ఎవరితోనన్న డబ్బులు పంపు హర్ష ఆయన హెల్త్ కూడా కన్నుకొని చెప్పు.నీ ప్రమేయం ఉన్నట్టు చెప్పకుండా వేరే ఒకరిని పంపమంటే నేను ఆ విధంగా పురామయించాననని తెలిపారు.
హరి రామ జోగయ్య గారు ఎవడో ఒకడు నా పేరు చెప్పి ఇలాగ చాలా మందిని మోసం చేస్తున్నాడు.నాకు డబ్బులు అవసరం ఏమిటి అని అవి తిరిగి పంపేశారు. ఆయన పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చారని హర్షకుమార్ చెప్పారు. కానీ పోలీస్ కేస్ పెట్టలేదని.. మా జ్యూరిస్ డిక్షన్ కాదని.. అన్నారని హర్షకుమార్ తెలిపారు. సైబర్ మోసాలకు jurisdiction ఏమిటని హర్షకుమార్ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ళ ఎవ్వరు మోసపోకూడని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నానన్నారు.
ఇటవలి కాలంలో వీడియో కాల్స్ కూడా డూప్లికేటింగ్ చేసి.. మోసం చేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖుల పేర్లతో ఫోన్లు చేసి.. అర్జంట్ గా డబ్బులు అవసరం అని చెప్పి..డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు కాజేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నందున సైబర్ నేరాల పట్ల ఎక్కువ మంది అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు పోలీసులు చేస్తున్నారు.