అన్వేషించండి

Hyderabad News: చాక్లెట్ ఇప్పిస్తానని బాలిక కిడ్నాప్ - గంటల్లోనే ఛేదించిన పోలీసులు, కిడ్నాపర్‌పై చిన్నారి బంధువుల దాడి

Crime News: హైదరాబాద్‌లో ఓ బాలికను దుండగుడు కిడ్నాప్ చేయగా.. ఫిర్యాదు అందుకున్న గంటల్లోనే పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. పాపను సేఫ్‌గా తల్లిదండ్రులకు అప్పగించారు.

Man Kidnapped Minor In Hyderabad: ఓ దుండగుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను కిడ్నాప్ చేశాడు. పాప కనిపించక కంగారు పడిన బంధువులు పోలీసులను ఆశ్రయించగా సీసీ ఫుటేజీ పరిశీలించి 5 బృందాలుగా ఏర్పడి గంటల్లోనే నిందితున్ని పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ తన సోదరునితో కలిసి నివసిస్తోంది. శనివారం సాయంత్రం తన సోదరుడు కుమార్తెతో కలిసి కట్టెలమండిలోని తల్లి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో బాలిక ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన ప్రియాంక, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక కిడ్నాప్

బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ అపరిచిత వ్యక్తి బాలికను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం గుర్తించారు. చాక్లెట్ ఇస్తానని చెప్పి పాపను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. 5 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు. గంటల్లోనే బాలిక ఆచూకీని గుర్తించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ఇనుముల నర్వలో పాపను గుర్తించిన పోలీసులు ఆమెను సేఫ్‌గా అబిడ్స్ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ బీహార్‌కు చెందిన బిలాల్‌గా గుర్తించారు. నిందితుడు కనిపించగానే బాలిక తల్లిదండ్రులు, బంధువులు అతనిపై దాడికి దిగగా పోలీసులు అడ్డుకున్నారు. అతికష్టం మీద నిందితున్ని అక్కడి నుంచి తరలించారు. పాపను సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Warangal Crime News: 250 కేజీల గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు, ఏపీ నుంచి అక్రమంగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget