అన్వేషించండి

Warangal Crime News: 250 కేజీల గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు, ఏపీ నుంచి అక్రమంగా!

Telangana News | ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 250 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Interstate Ganja Smuggling Gang Arrested in Warangal | వరంగల్: వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఐదుగురు సభ్యుల గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏకంగా 256 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం (ఆగస్టు 3న) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ 64 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి ముఠా వద్ద నుంచి రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. 

నర్సంపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి నర్సంపేట స్టేషన్ పరిధిలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న క్రమంలో దొరికిపోయారని వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులు బానోతు బాబు కుమారస్వామి, నస్కరి కుమారస్వామిలు కారు డ్రైవర్‌ గా చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన వీరికి మహబూబాబాద్ జిల్లాకు చెందిన జలెందర్, భూపాల్‌పల్లి జిల్లాకు చెందిన అంగోతు రాజేందర్, తూర్పు గోదావరికి చెందిన ముకుంద్ లతో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, అక్రమ సంపాదన ఆలోచనకు దారి తీసిందని సీపీ తెలిపారు. 

Warangal Crime News: 250 కేజీల గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు, ఏపీ నుంచి అక్రమంగా!

ఆంధ్రప్రదేశ్‌లోని డొంకరాయి పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు చెప్పారు. డొంకరాయి గ్రామంలో 256 కిలోల గంజాయిని కోనుగోలు రెండుకిలోల చొప్పున 128 ప్యాకెట్ల లో ప్యాక్ చేసి కారులో ఎవరికి అనుమానం రాకుండా డొంకరాయి నుండి భద్రాచలం, మహబూబాబాద్ మీదుగా నర్సంపేటకి  నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో  పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ నర్సంపేట  పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు అంబర్ కిషోర్ ఝ తెలిపారు. బానోతూ బాబు కుమారస్వామి, నస్కరి కుమారస్వామిల అరెస్ట్ చేయగా, జలెందర్, అంగోతు రాజేందర్, ముకుంద్ లు ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సిపి అంబర్ కిషోర్ ఝ వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget