Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కలకలం, ఒంటిపై కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Telangana CM Revanth Reddy: హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది.
Man suicide attempt at Revanth Reddy residence: హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని నివాసం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అతడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై, ఆ వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని సూసైడ్ అటెంప్ట్ చేశాడని ప్రచారం జరుగుతోంది. అతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఈ పచ్చి పనికి యత్నించాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అతడు కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి..
ఆత్మహత్యాయత్నం చేసింది కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్ నేత కృష్ణ సాగర్ ఆరోపించారు. తనలాంటి వారికి కాంగ్రెస్ లో గుర్తింపు, సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ పని చేసినట్లు సమాచారం. ఆత్మహత్య అనేది నేరం కనుక, కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.