అన్వేషించండి

Vizianagaram Latest News: జాతరలో పోకిరీల అసభ్య చేష్టలు- వారించిన మహిళా ఎస్సైపై దాడి- గుడివాడలో ఘటన   

Vizianagaram Latest News: విజయనగరం జిల్లాలోని గుడివాడ గ్రామంలో జరిగిన ఘటన సంచలనంగా మారుతోంది. పోకిరీలను అడ్డుకున్న ఎస్సైపైనే యువకులు దాడి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Vizianagaram  Latest News: విజయనగరం జిల్లా గుడివాడలో జరుగుతున్న జాతరలో ఓ లేడీ ఎస్సైపై పోకిరీలు దాడి చేశారు. ఆమెను ఇష్టం వచ్చినట్టుతిట్టమే కాకుండా దాడి కూడా చేశారు. యువతులను ఇబ్బంది పెడుతుంటే వారించినందుకు పోకిరీలు రెచ్చిపోయారు. 

వేపాడ మండలంలోని గుడివాడ గ్రామంలో వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్ పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం జరుగుతుంటే కొందరు పోకిరీలు వెకిలిచేష్టలు చేశారు. కార్యక్రమానికి వచ్చిన యువతులు, సందర్శకులతో అసభ్యంగా ప్రవర్తించారు. 

పోకిరీల చేష్టలు గమనించిన అక్కడే ఉన్న వల్లంపూడి ఎస్సై బి.దేవి వార్నింగ్ ఇచ్చారు. పద్దతి కాదని చెప్పారు. కానీ వారు వినిపించుకోలేదు. దీంతో వారిపై ఎస్సై చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో కుర్రాళ్లు మరింతగా రెచ్చిపోయారు. 

అసలు అక్కడ గొడవ జరగలేదని... ఎందుకు ఎస్సై చేయి చేసుకున్నారని ప్రశ్నించారు. తను కొట్టడం ఏంటని నిలదీశారు. అసలు తాగి వచ్చి రభస చేయడం ఏంటని తిరిగి ప్రశ్నించారు. పద్ధతిగా లేదని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. 

మందలు మందలుగా వచ్చి ఎస్సైను దుర్భాషలాడారు. ఆమెను కొట్టేందుకు పైపైకి వచ్చారు. పక్కనే ఉన్న వాళ్లు వారిస్తున్నా వినిపించుకోలేదు. ఆమెను జుట్టుపట్టి లాగి దాడికి యత్నించారు. ప్రాణ భయంతో ఆమె సమీపంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు.  

యువకుల నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీసిన ఎస్సై స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఫుల్ బెటాలియన్‌తో వచ్చారు. కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సైపై దాడి చేసిన 9 మందిని అరెస్టు చేశారు. ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గాయాలు పాలైన ఎస్సై స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.  

ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా ఎస్సైపై దాడి క్షమించరాని నేరమని అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో మాట్లాడిన అనిత పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కేసు వివరాలను హోంమంత్రికి అనిత వివరించారు. మహిళల పట్ల పోకిరీ వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని  వార్నింగ్ ఇచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget