Zomato Food Rescue Feature: ఆహార వృథాను తగ్గించే సరికొత్త ప్రయత్నం ‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్’ గురించి తెలుసా!
Zomato New Feature | ఫుడ్ ఆర్డర్ చేసి ఆ తరువాత ఏదో కారణంతో కొందరు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ అలా చేయడంతో ఫుడ్ వేస్ట్ కాకుండా సరికొత్త ఫీచర్ తీసుకొచ్చి జొమాటో అందరి ప్రశంసలు అందుకుంటోంది.
Zomato Food Rescue Feature: ఆహారం వృథా కావడం ప్రస్తుతం సమాజంలో ఎదురవుతున్న ప్రధాన సమస్యలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో, ఆర్డర్లు రద్దు కావడం వల్ల ఎంతో ఎడిబుల్ ఆహారం వృథా అవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జోమాటో సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్’ అందరి ప్రశంసలు పొందుతోంది.
జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయెల్ ఈ ఫీచర్ వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నెలకు సుమారు 4 లక్షల ఆర్డర్లు రద్దు అవుతున్నాయి అని వెల్లడిస్తూ, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఎంతో ఉపయోగంగా మారుతుందని తెలిపారు.
Zomato Food Rescue Feature: ఏంటి దీని ప్రత్యేకత?
ఈ ఫీచర్ ద్వారా రద్దు అయిన ఆర్డర్ల గురించి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు నోటిఫికేషన్లు పంపిస్తారు. ఆహారం తాజాగా ఉండేలా, కస్టమర్లు తక్కువ సమయం లోనే ఆర్డర్‌ను క్లెయిమ్ చేయవచ్చు. అంతేకాకుండా ఆర్డర్ తక్కువ రేటుకు అందుబాటులో ఉంటుంది.
ఇది ఎలా పని చేస్తుంది?
ఈ ఫుడ్ రెస్క్యూ ఆప్షన్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకునే కస్టమర్‌లకు ఒక నోటిఫికేషన్ పంపబడుతుంది. తయారయిన ఫుడ్ ఆర్డర్ క్లెయిమ్ చేయడానికి 5 నిమిషాల సమయం ఉంటుంది. Cancel అయిన అడ్రస్ నుండి 3 km పరిధిలో ఉన్న కస్టమర్లు ఆ ఆర్డర్‌ను చెక్ చేసుకుని, తక్కువ ధరకు పొందవచ్చు. అయితే, మొదట ఆర్డర్ చేసి cancel చేసిన వ్యక్తి ఆ ఆహారాన్ని తిరిగి క్లెయిమ్ చేయలేరు.
ఫుడ్ ఆర్డర్ ను కొత్త కస్టమర్ క్లెయిమ్ చేసుకున్నాక కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తం రెస్టారెంట్ మరియు మొదటి కస్టమర్‌కి పంచబడుతుంది.
గత విధానం Vs ప్రస్తుత విధానం
గత విధానం:
- గతం లో ఫుడ్అ య్యాక రద్దయ్యే ఫుడ్ ఆర్డర్లు వృథా అయ్యేవి.
- ఆర్డర్ రద్దు చేసే కస్టమర్లకు పరిహారం ఇవ్వడం కష్టంగా ఉండేది.
- డెలివరీ పార్ట్నర్‌ల ఆదాయంపై తీవ్ర ప్రభావం ఉండేది.
ప్రస్తుత విధానం:
- రద్దైన ఆర్డర్లు కొత్త కస్టమర్లకు అందించబడుతున్నాయి.
- రెస్టారెంట్లు, డెలివరీ పార్ట్నర్‌లు ఆర్ధికంగా నష్టపోకుండా చూస్తున్నారు.
- ఆహార వృథా తగ్గడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే మార్గంగా నిలుస్తోంది.
Zomato Food Rescue Highlights:
- ఐస్‌క్రీమ్, షేక్ వంటి త్వరగా చెడిపోయే ఆహారాలు ఈ ఫీచర్‌లో లేవు.
- డెలివరీ పార్ట్నర్ సేవలకి తగిన మొత్తం 100% చెల్లిస్తారు.
- జోమాటో ఎటువంటి అదనపు ఛార్జ్ వసూలు చేయదు.
ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ప్రయోజనాలు:
- ఆహారం వృథా కాకుండా, అవసరమైన కస్టమర్లకు చేరడం లో ఈ ఫీచర్ ఏంతో ఉపయోగ పడుతుంది.
- రెస్టారెంట్లకు వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- కస్టమర్లకు తక్కువ ధరలో క్వాలిటీ ఆహారం లభిస్తుంది.
సమాజంపై సానుకూల ప్రభావం:
ఈ ప్రయత్నం ద్వారా జోమాటో సంస్థ కేవలం వ్యాపార అభివృద్ధి మాత్రమే కాకుండా, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపించే దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో, ఈ ఫీచర్ మరింత విస్తరించి, ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ఆహారాన్ని అవసరమైన వారికి తగిన సమయంలో తక్కువ ధర కు అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని కొందరు ఫుడ్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.