నిపుణులు చెప్పేది ఏమిటంటే.. జీడిపప్పుతో బరువు పెరగవచ్చు అలాగే తగ్గవచ్చట.

అయితే దానిని ఎలా తీసుకుంటున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

జీడపప్పులోని ఫైబర్ కడుపు నిండుగా చేసి.. ఇతర క్రేవింగ్స్ తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.

వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

జీడిపప్పులో ప్రోటీన్​ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.

జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 28 గ్రాముల్లో 157 కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి.

హెల్తీ ఫ్యాట్స్ బరువు తగ్గేలా చేస్తాయి. ఎక్కువగా వీటిని తింటే బరువు పెరిగేలా కూడా చేస్తాయి.

బరువు తగ్గాలనుకుంటే రోజుకు 16 నుంచి 18 జీడిపప్పులు తినవచ్చు.

బరువు పెరగాలనుకుంటే 32 నుంచి 48 జీడిపప్పులు తీసుకోవచ్చు.

షుగర్ లేనివి, సాల్ట్ లేని వాటిని తీసుకుంటే జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.