చలికాలంలో జలుబు అనేది చాలా కామన్‌గా వస్తూ ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఉపశమనం పొందవచ్చు. నీళ్లు మరిగించి.. యూకలిప్టస్ ఆయిల్ వేసి.. స్టీమ్ తీసుకుంటే జలుబు నుంచి రిలీఫ్ ఉంటుంది. సాల్ట్, బేకింగ్ సోడాను వేడి నీళ్లల్లో వేసి.. ముక్కు రంధ్రాలు క్లీన్ చేసినా.. మంచి ఫలితముంటుంది. తేనె, నిమ్మరసాన్ని ఒకే మోతాదులో కలిపి తీసుకుంటే గొంతునొప్పి, జలుబు తగ్గుతుంది. అల్లాన్ని వేడి నీటిలో వేసి మరిగించి.. వేడి వేడిగా తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది. తేనె, దాల్చిన చెక్కపొడిని కలిపి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు కూడా తగ్గుతుంది. చికెన్ లేదా వెజిటేబుల్ సూప్ కూడా జలుబును దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. హాట్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా జలుబును తగ్గిస్తుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Image Source : Envato,Freepik)