అన్వేషించండి

Indian Stock Market Rally: భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 

పశ్చిమాసియాలో యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన భారత్ మార్కెట్‌కు కొత్త కల తీసుకొచ్చింది. ఇదే జోరు రేపు కొనసాగుతుందా లేదా అనేది చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం, సెన్సెక్స్, నిఫ్టీ పెరిగాయి.
  • పెట్టుబడిదారుల సంపద ఒక్క రోజులో రూ. 11 లక్షల కోట్లు పెరిగింది.
  • ఇరాన్-ట్రంప్ ప్రకటన, తగ్గిన బ్రెంట్ క్రూడ్ ధర మార్కెట్లకు ఊతం.
  • మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, బ్యాంకింగ్, మెటల్స్ రంగాలలో పెట్టుబడులు పెరిగాయి.

Stock Market India: కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతోనే భారత్ స్టాక్‌మార్కెట్‌లలో సరికొత్త ఉత్సాహాన్ని ప్రదర్శించాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్‌ వేసింది. ఇదే జోరు రేపు కొనసాగుతుందా అనేది అందరిలో కనిపిస్తున్న ఉత్కంఠ. ఆ వివరాలు గురించి ఇక్కడ చూద్దాం. నేటి సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త వృద్ధిని నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 118.77 పాయింట్లు లేదా 1.65 శాతం లాభపడి 73,134,32 వద్ద స్థిరపడింది. అదే విధంగా నిఫ్టీ 348 పాయింట్లు వృద్ధితో 22,679.40 వద్ద ముగిసింది. 

ఈ భారీ పెరుగుదల కారణంగా బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో ఉన్న రూ. 411 లక్షళ కోట్ల నుంచి 422 లక్షళ కోట్లకు చేరింది. అంటే ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు 11 లక్షల కోట్లు పెరిగింది. 

ఈ పెరుగుదలకు కారణమేంటీ?

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ పురోగతికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ట్రంప్ ప్రకటన. ఇరాన్‌పై సైనిక చర్య మరో రెండు మూడు వారాల్లో ముగుస్తుందని చెప్పడంతో మార్కెట్‌లో జోష్ కనిపించింది. మధ్యప్రాచ్యంలో అనిశ్చితి తగ్గుతుందనే నమ్మకం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీనికి తోడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధలు 105 డాలర్ల స్థాయికి తగ్గడం కూడా భారత్‌ మార్కెట్‌కు బాగా కలిసి వచ్చింది. రూపాయి విలువ స్థిరంగా ఉండటం కూడా మరో కారణం. గతంలో భారీగా తగ్గిన షేర్లను తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం మార్కెట్‌కు బలాన్ని ఇచ్చింది. డిఫెన్సివ్‌ నుంచి సైక్లికల్‌ రంగాల వైపు పెట్టుబడిదారులు మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంకింగ్, కెమికల్స్‌, మెటల్స్, రియాల్టీ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. 

టాప్ గెయినర్స్ ఎవరు? 

బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే సానుకూలత కనిపించింది. మిడ్ క్యాప్,స్మాల్ క్యాప్ షేర్లు లార్జ్ క్యాప్‌ షేర్ల కంటే మెరుగ్గా రాణించాయి. స్మాల్‌ క్యాప్‌, మిడ్ క్యాప్‌ సూచీలు మూడు శాతానికిపైగా వృద్ధిని సాధించాయి. 

టాప్ గెయినర్స్‌ ఇవే 

ట్రెంట్‌- 6.74 శాతం, ఇండిగో- 6.22 శాతం, అదానీ పోర్ట్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ షేర్లు కూడా 3.34 శాతం నుంచి 5.47 శాతం వరకు పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. 

రేపటి మార్కెట్ ఎలా ఉండబోతోంది?

మార్కెట్ రికవరీ సంకేతాలు చూపిస్తున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుతం 22,400-23,500 శ్రేణిలో కన్సోలిడేషన్ దశలో ఉంది. నిఫ్టీ 23000 స్థాయిని దాటితేనే మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక వేళ 22,500 దిగువకు మళ్లీ పడిపోతే అమ్మకాల ఒత్తిడి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సెన్సెక్స్‌కు 72,400-72,500 వద్ద బలమైన మద్దతు ఉందని, 73,900-74,000 వద్ద రిసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్చి నెలలో మార్కెట్‌లు భారీగా షేక్ అయ్యింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, ఇంధన సరఫరా వ్యవస్థలో మార్పులు మార్కెట్‌పై సానుకూలంగా ఉంటుందని గతమంతా ఒత్తిడి లేకపోవచ్చని చెబుతున్నారు.                

Frequently Asked Questions

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో స్టాక్ మార్కెట్ పనితీరు ఎలా ఉంది?

కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతోనే భారత స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1.65% లాభపడి 73,134.32 వద్ద, నిఫ్టీ 22,679.40 వద్ద ముగిశాయి.

మార్కెట్ పెరుగుదలకు ప్రధాన కారణాలు ఏమిటి?

ఇరాన్‌పై సైనిక చర్య ముగుస్తుందనే ట్రంప్ ప్రకటన, మధ్యప్రాచ్యంలో అనిశ్చితి తగ్గడం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, రూపాయి విలువ స్థిరంగా ఉండటం, మరియు తక్కువ ధరలో షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్ల ఆసక్తి వంటివి మార్కెట్ పెరుగుదలకు దోహదపడ్డాయి.

నేటి ట్రేడింగ్‌లో ఏ రంగాల షేర్లు బాగా రాణించాయి?

మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు లార్జ్ క్యాప్ షేర్ల కంటే మెరుగ్గా పనిచేశాయి. బ్యాంకింగ్, కెమికల్స్, మెటల్స్, రియాల్టీ రంగాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.

రేపటి మార్కెట్ ఎలా ఉండబోతోంది?

మార్కెట్ రికవరీ సంకేతాలు కనిపిస్తున్నా, నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నిఫ్టీ 23000 స్థాయిని దాటితేనే మరింత పెరుగుదల ఉంటుంది, లేదంటే అమ్మకాల ఒత్తిడి ఉండవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget