Insurance Grace Period : బీమాలో గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి? - దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి
Insurance Grace Period : పాలసీదారు బీమా చెల్లింపునకు ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం గ్రేస్ పీరియడ్. ఇది చెల్లింపులో ఆలస్యానికి విధించే సమయం.
Insurance Grace Period : చాలావరకు అందరూ తాము తమ ప్రియమైన వారు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఏ అవసరం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. అకస్మాత్తుగా అర్థిక సమస్యలు చుట్టుముట్టి మన ఫ్యామిలీని అతలాకుతలం చేయొచ్చు. కొన్ని అనుకోని సందర్భాల్లో అనేక ఇబ్బందులు రావచ్చు లేదా ఆరోగ్యం చెడిపోవచ్చు లేదా మరణమే సంభవించవచ్చు. కాబట్టి చాలా మంది ముందస్తు ప్రణాళికగా బీమా పాలసీ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తాము ఒకవేళ లేకపోయినా తనపై ఆధారపడిన వారికి ఆర్థికంగా సాయంగా ఉంటుందని భావిస్తారు. ఇది వారు సురక్షితంగా, ఆర్థికంగా కాస్త ఉపశమనాన్నిస్తుంది. అయితే ఇన్సూరెన్స్ లో గ్రేస్ పాలసీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ తెలియని వారు మాత్రం ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. అదే గ్రేస్ పిరియడ్. ఇంతకీ గ్రేస్ పిరియడ్ అంటే ఏమిటి, అదెలా పని చేస్తుందన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రేస్ పీరియడ్ అంటే..
పాలసీదారు ప్రీమియంలను సకాలంలో చెల్లించడంలో ఆలస్యం లేదా మర్చిపోతే.. అంటే మొత్తానికి చెల్లించకపోతే బీమా ప్రొవైడర్ అందించే అదనపు సమయమే బీమా గ్రేస్ పీరియడ్. పాలసీదారు ప్రీమియం చెల్లింపులో జాప్యం జరిగినప్పుడు బీమా పాలసీ ల్యాప్స్ కాకుండా ఉండేలా బీమా గ్రేస్ పీరియడ్ రక్షిస్తుంది. పాలసీదారుడు ప్రీమియంలను సకాలంలో చెల్లించాలి. ఫలితంగా అతను లేదా ఆమె పాలసీ ప్రయోజనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్ చేయవచ్చు. సాధారణంగా, బీమా కంపెనీలు 30 రోజుల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. అయితే, ఇది కంపెనీ నుండి కంపెనీకి మారవచ్చు. కొన్ని కంపెనీలైతే ఈ ఆప్షన్ ను ఇవ్వకపోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో చాలానే ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తున్నందున పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకునేందుకు గ్రేస్ పిరియడ్ అనే పేరుతో పాలసీదారులను ఆకర్షిస్తున్నాయి బీమా కంపెనీలు.
గ్రేస్ పిరియడ్ ముగిసిన తర్వాత..
ప్రతి పాలసీదారుడు ప్రీమియంలను సకాలంలో చెల్లించాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు తప్పనిసరి. బీమా కంపెనీ ద్వారా బీమా గ్రేస్ పీరియడ్ అందించిన తర్వాత కూడా మనం ప్రీమియంలను చెల్లించకపోతే అనేక ప్రతికూలతలు ఎదురవుతాయి. దీని వల్ల పాలసీ ల్యాప్స్ లేదా రద్దయ్యే అవకాశముంటుంది. దీని వల్ల అప్పటివరకు మనం చెల్లించిన మొత్తాన్ని కోల్పేయే ప్రమాదం ఉండొచ్చు. మనకు రావాల్సిన ప్రయోజనాలను కోల్పోవచ్చు. కావున ప్రీమియంలను ఎప్పటికప్పుడు చెల్లించడం ఉత్తమం.
బీమా గ్రేస్ పీరియడ్ అనేది కేవడం బీమా పొడిగింపుకు సమయం మాత్రమే కాదు. చెల్లింపు ఆలస్యాలను సరిదిద్దడానికి, మీరు పాలసీ ప్రయోజనాలును పొందేందుకు మరో అవకాశం. అయితే ఈ వ్యవధిని ఉపయోగించాలంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి,
వ్యవధిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం:
చాలా బీమా కంపెనీలు 30 రోజుల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తున్నప్పటికీ, మీ ప్రొవైడర్‌తో నిర్దిష్ట వ్యవధిని నిర్ధారించుకోవడం చాలా అవసరం. కొన్ని కంపెనీలు ఈ విషయంలో తేడాలను కలిగి ఉండవచ్చు.
లోపాలను నివారించండి:
పాలసీ లోపాలను నివారించడానికి గ్రేస్ పీరియడ్‌ను తెలివిగా ఉపయోగించుకోండి. ఈ కాలంలో అయినా సకాలంలో చెల్లింపులు చేయండి. ఇది మిమ్మల్ని ఆర్థిక, కవరేజ్ సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షించగలవు.
భవిష్యత్ ప్రణాళికను పరిగణించండి:
చెల్లింపు ఆలస్యం వల్ల కలిగే దీర్ఘకాలిక చిక్కుల గురించి తెలుసుకోండి. ల్యాప్స్ అయిన పాలసీ మీ ప్రస్తుత కవరేజీని ప్రభావితం చేయడమే కాకుండా భవిష్యత్తులో మీ బీమా ప్రయాణాన్ని క్లిష్టతరం చేస్తుంది.
Also Read : Inherited Property: పెళ్లయిన కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందా, ఆస్తిని సమానంగా పంచి ఇవ్వాల్సిందేనా?