Inherited Property: పెళ్లయిన కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందా, ఆస్తిని సమానంగా పంచి ఇవ్వాల్సిందేనా?
Married Daughter Property Rights: పెళ్లి తర్వాత కూడా కుమార్తెకు ఆమె తండ్రి ఆస్తిపై సమాన హక్కు ఉంటుందా అనే విషయాన్ని చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు.
Hindu Succession Act: మహిళలకు సాధికారత కల్పించడానికి, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అనేక రకాల పథకాలను ప్రారంభిస్తోంది. మహిళలను చిన్నచూపు చూడకూడదని దేశ ప్రజలందరికీ అర్ధమయ్యేలా చెప్పడానికి, భారత రాజ్యాంగంలో కూడా స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించారు. గతంతో పోలిస్తే, ఇప్పుడు, మగ పిల్లవాడు - ఆడపిల్ల అనే వివక్ష గణనీయంగా తగ్గింది. తల్లిదండ్రులు కొడుకు, కుమార్తె ఇద్దరికీ సమానమైన ప్రేమను పంచుతున్నారు. కుమారుడితో సమానంగా కుమార్తెనూ చదివిస్తున్నారు, ఘనంగా వివాహం జరిపిస్తున్నారు.
సమానంగా ప్రేమను పంచడం ఓకే, మరి ఆస్తిలోనూ ఇద్దరికీ సమానంగా వాటా ఉంటుందా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. మగ పిల్లవాడిని వంశానికి వారసుడిగా పరిగణిస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా అతనికి ఆస్తిలో వాటా లభిస్తుంది. కానీ, ఆడపిల్ల పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోతుంది. కాబట్టి, ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరిస్తారా?, ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆస్తిని పంచకుండా చేతులు దులుపుకున్నట్లేనా?. వివాహమైన కుమార్తె కోర్టుకు వెళ్లి తన తండ్రి ఆస్తిలో సమాన భాగాన్ని సాధించుకోలదా? ఈ ప్రశ్నలకు చట్టం చెప్పే సమాధానాలు ఏంటి?.
పెళ్లయిన తర్వాత కూడా కూతురుకు ఆస్తిపై హక్కు ఉంటుందా?
భారతదేశంలో ఆస్తి పంపిణీకి సంబంధించి, హిందు వారసత్వ చట్టాన్ని 1956 సంవత్సరంలో (The Hindu Succession Act of 1956) ఆమోదించారు. ఈ చట్టానికి 2005లో సవరణ (Amendment) చేశారు. ఆ సవరణ ప్రకారం... పెళ్లి తర్వాత కూడా తన తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కును కల్పించారు. 2005కు ముందు, చట్ట ప్రకారం, కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిపై ఎలాంటి హక్కులు లేదు.
అయితే, ఆస్తి వాటా విషయంలో ఒక ప్రొవిజన్ కూడా ఉంది. ఒక వ్యక్తి, తన ఆస్తి మొత్తం తన కుమారుడు లేదా కుమారులకు మాత్రమే చెందేలా వీలునామా రాసి, కుమార్తె/కుమార్తెల గురించి ఆ వీలునామాలో ప్రస్తావించకపోతే, ఆ మొత్తం ఆస్తి అతని కుమారుడు/కుమారులకు మాత్రమే చెందుతుంది. అలాంటి పరిస్థితిలో కుమార్తెలకు ఆస్తిపై హక్కు ఉండదు. ఆస్తిలో వాటా పొందడానికి ఆమె చేసే ఏ ప్రయత్నమూ చట్టప్రకారం ఫలించదు. ఆస్తి హక్కుల నిబంధనల ప్రకారం, ఏ వ్యక్తి అయినా, తాను సొంతంగా సంపాదించిన ఆస్తిని తన ఇష్టానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చు.
పూర్వీకుల ఆస్తిలో వాటా
హిందు వారసత్వ చట్టం 2005 నిబంధనల (The Rules of Hindu Succession Act, 2005) ప్రకారం, పూర్వీకుల ఆస్తిపై వివాహమైన కుమార్తెకు కూడా కొడుకుతో సమానంగా హక్కు ఉంటుంది. తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిపై మాత్రమే ఆమెకు హక్కు ఉండదు. తాత లేదా అంతకుముందున్న వ్యక్తులు సంపాదించిన ఆస్తి "కుటుంబ వారసత్వ ఆస్తి" అవుతుంది. ఇలా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించే కుటుంబ వారసత్వ ఆస్తిలో, పెళ్లయిన తర్వాత కూడా కూతురుకు సమాన హక్కులు ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్షన్ - నిరాశ చెందొద్దు, న్యాయం జరిగే దారుంది