అన్వేషించండి

Mallya Mocks IDBI Bank: విజయ్ మాల్యా నుంచి బాకీ వసూలు చేసిన బ్యాంక్.. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..

కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం విజయ్ మాల్యా తమ వద్ద తీసుకున్న అప్పును వడ్డీతో సహా రూ. రూ. 753 కోట్లు చెల్లించారని ఐడీబీఐ ప్రకటించింది.

అప్పుల అప్పారావు నుంచి అప్పు వసూలు చేసుకోవడం గొప్ప పనే. అప్పు చెల్లించడమే అలవాటు లేని వారి దగ్గర.. రికవరీ చేయడం అంటే.. బ్యాంకులకైనా తల ప్రాణం తోకకు వస్తుంది. బ్యాంకుల వద్ద అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా అలాంటి అప్పుల అప్పారావే. ఆయన నుంచి డబ్బులు వసూలు చేసుకోలేక.. ఆయన ఆస్తులు వేలం వేసుకోలేక.. ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఆస్తులన్నీ అటాచ్ చేసుకుని.. వేలం వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆయనను ఇండియాకు రప్పించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే.. ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాయి. 

అలాంటి వ్యాపారవేత్త విజయ్ మాల్యా దగ్గర నుంచి ఓ బ్యాంక్ మొత్తం అప్పులను రికవరీ చేసుకుంది. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తున్నా నిజమే. ఆయన తమ వద్ద తీసుకున్న అప్పులను మొత్తం తిరిగి చెల్లించారని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అధికారికంగా ప్రకటించింది. విజయ్ మాల్యా తమ వద్ద తీసుకున్న రుణానికి వడ్డీతో సహా రూ. 753 కోట్లు చెల్లించారని ప్రకటించారు. మాల్యా తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఐడీబీఐ వద్ద అప్పులు తీసుకున్నారు. తర్వాత ఆ సంస్థ దివాలా తీసింది. విజయ్ మాల్యా డబ్బులు చెల్లించకుండా లండన్‌కు మకాం మార్చారు. కానీ ఆయన ఐడీబీఐకి మాత్రం అప్పులు చెల్లించారు. 

మాల్యా లండన్ పారిపోయిన తర్వాత బ్యాంకులు.. మాల్యాకు చెందిన ఆస్తులను వేలం వేయడం ప్రారంభించాయి. గోవాలో ఉన్న మాల్యా హౌస్‌ను అమ్మేశారు. ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తులను కొనడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బ్యాంకులకు గిట్టుబాటు కాలేదు. ప్రస్తుతం ఆ ఆస్తులన్నీ ఈడీ అటాచ్‌లో ఉన్నాయి.  విజయ్ మాల్యా లండన్ పారిపోయినప్పటి నుండి తాను డబ్బులు తిరిగి కడతాననే చెబుతూ వస్తున్నారు. నిజానికి విజయ్ మాల్యా చాలా కాలం నుంచి ఒకే మాట చెబుతున్నారు. బాకీ మొత్తం బ్యాంకులకు చెల్లిస్తానని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మొత్తంగా బ్యాంకులకు రూ.13,960 కోట్లు చెల్లిస్తానని ఆయన అంటున్నారు. మొత్తంగా సెటిల్మెంట్ ప్యాకేజీ కింద.. చెల్లించేందుకు సిద్ధమని చెబుతున్నారు. అయితే తిరిగి ఇస్తూంటే ఎవరు వద్దంటారు... కానీ ఆయన మాత్రం ఓ షరతు పెడుతున్నారు. అదేమిటంటే.. ముందుగా తన ఆస్తులను అటాచ్‌మెంట్ నుంచి విడిపిస్తే.. వాటిని అమ్మేసి  బాకీ తీరుస్తానని ఆయన అంటున్నారు.  విజయ్ మాల్యాను మాత్రం నమ్మలేమని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget