(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2022: 3 ఏళ్ల బ్యాంకు FDకి పన్ను వద్దు ప్లీజ్! బ్యాంకర్ల డిమాండ్!!
తమ ఆశల చిట్టాను బ్యాంకర్లు ప్రభుత్వం ముందుంచారు. ఈక్విటీ లింకుడు సేవింగ్స్ స్కీమ్ (ELSS)లా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (Fixed Deposites) పన్ను మినహాయింపు ప్రయోజనాలు (Tax Deduction benifits) కల్పించాలని కోరుతున్నారు.
Budget 2022 Telugu, Union Budget 2022: బడ్జెట్‌కు ముందు ఆశావహులు, వ్యాపార వర్గాలు, ప్రజల ఆంక్షలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ సారీ అలాంటి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఆశల చిట్టాను బ్యాంకర్లు ప్రభుత్వం ముందుంచారు. ఈక్విటీ లింకుడు సేవింగ్స్ స్కీమ్ (ELSS) తరహాలో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (Fixed Deposites) పన్ను మినహాయింపు ప్రయోజనాలు (Tax Deduction benifits) కల్పించాలని కోరుతున్నారు.
మూడేళ్లకు తగ్గించండి
ప్రస్తుతం ఐదేళ్ల కాల పరిమితితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై కస్టమర్లకు పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఆదాయపన్ను చట్టంలోని 80C కింద ఐదేళ్ల ఎఫ్‌డీలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. మొత్తంగా 80Cలో మినహాయింపు పరిమితి రూ.1.50 లక్షలే అన్న సంగతి తెలిసిందే. పన్ను మినహాయింపు ప్రయోజనాలను మూడేళ్ల ఎఫ్‌డీలకూ కల్పించాలని బ్యాంకర్లు కోరుతున్నారు. దాంతో ఎఫ్‌డీలు ఆకర్షణీయంగా మారుతాయని అంటున్నారు.
మిగతా వాటితో పోలిస్తే
'మార్కెట్లోని ఈఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్ల వంటి ఆర్థిక సాధనాలతో పోలిస్తే పన్ను ప్రయోజనాలు లభించే ఎఫ్‌డీలు ఆకర్షణీయంగా లేవు. అందుకే లాకిన్ పిరియడ్‌ను మూడేళ్లకు తగ్గిస్తే ఎఫ్‌డీలు అత్యంత ఆకర్షణీయంగా మారతాయి. బ్యాంకులకు మరిన్ని నిధులు అందుతాయి' అని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వానికి తెలిపింది.
రిబేట్లు ఇవ్వండి
డిజిటల్ బ్యాంకింగ్ ప్రమోషన్, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలకు చేసే ఖర్చులపై రిబేటు లేదా అదనపు తరుగు కల్పించాలని బ్యాంకర్లు డిమాండ్ చేస్తున్నారు. బలహీన వర్గాల కోసం బ్యాంకులు డిజిట్ బ్యాంకింగ్, సులభతర వాణిజ్యం, ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం గుర్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే ఐటీ సేవలకు డబ్బులు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. అందుకే మూలధనం ఖర్చుపై 125 శాతం వరకు డిప్రిసియేషన్ లేదా ప్రత్యేక పన్ను రిబేటు వంటివి కల్పించాలని కోరుతున్నారు.
పరిష్కార వేదిక
పన్నులకు సంబంధించిన వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక పరిష్కార వ్యవస్థను తీసుకురావాలని బ్యాంకర్లు కోరుతున్నారు. భారీ డబ్బుతో ముడిపడిన అంశాల్లో అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ శాఖలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!