(Source: ECI/ABP News/ABP Majha)
Property Purchase: రూ.100 కోట్ల ప్రాపర్టీకి రూ.100 స్టాంప్ డ్యూటీ - ఇప్పుడిదే హాట్ టాపిక్
UK Govt Dept Buys Office In Mumbai: ముంబైలో స్టాంప్ డ్యూటీ రేటు 6 శాతం. ఈ లెక్క ప్రకారం, రూ.101 కోట్ల విలువైన ఆఫీస్ స్పేస్ డీల్ కోసం స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 6 కోట్లకు పైగా చెల్లించాలి.
Mumbai Property Deal: మన దేశంలో స్తిరాస్థి వ్యాపారానికి కేంద్ర బిందువు ముంబై. ప్రపంచంలోని ఖరీదైన నగరాల్లో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఒకటి. ఆస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఈ మహా నగరం ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లోకి వస్తూనే ఉంటుంది. ముంబైలో కోట్ల రూపాయల విలువైనల ఆస్తి ఒప్పందాలు తరచు జరుగుతుంటాయి, ఎప్పటికప్పుడు పాత రికార్డ్‌లు బద్ధలవుతుంటాయి. ఆ తరహా ప్రాపర్టీ డీల్స్ నుంచి ప్రభుత్వాలు కూడా భారీగా సంపాదిస్తుంటాయి.
అయితే, ఓ ప్రాపర్టీ డీల్ ఇప్పుడు ముంబైలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు కూడా ఖరీదైన వ్యవహారమే అయినా, దీనికోసం నామమాత్రపు స్టాంపు డ్యూటీ చెల్లించిన విషయం ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ అయింది. జనం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
రూ.100 కోట్లకు పైగా ప్రాపర్టీ డీల్
ఈ కేస్‌లో... ముంబైలోని లోయర్ పరేల్‌లో ఒక ఆఫీస్ స్పేస్ కోసం స్థిరాస్తి ఒప్పందం జరిగింది. 101 కోట్ల రూపాయలతో ఆఫీస్ స్పేస్‌ను కొనుగోలు బ్రిటిష్ కాన్సులేట్ కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో కేవలం 100 రూపాయల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. ప్రస్తుతం, ముంబైలో అమల్లో ఉన్న రేటు ప్రకారం ఈ సుంకం కోట్లలో ఉండాలి.
ప్రస్తుతం, ముంబైలో స్టాంప్ డ్యూటీ రేటు 6 శాతం. ఈ లెక్క ప్రకారం, రూ.101 కోట్ల విలువైన ఆఫీస్ స్పేస్ డీల్ కోసం స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 6 కోట్లకు పైగా చెల్లించాలి. కానీ, వంద రూపాయల స్టాంప్ డ్యూటీతో ఈ డీల్ క్లోజ్
అయింది. అందుకే ఈ ఆస్తి విక్రయం పతాక శీర్షికల్లో నిలిచింది, దీని గురించి జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఎందుకని ఇంత భారీ తగ్గింపు?
మీ మనస్సులోనూ ఈ ప్రశ్న తలెత్తిందా?. సాధారణంగా, ఒక దేశ కాన్సులేట్‌కు దౌత్యపరమైన చాలా సౌకర్యాలు ఉంటాయి. వియన్నా కన్వెన్షన్ ప్రకారం, అమల్లో ఉన్న దౌత్య సదుపాయాల్లో అతి తక్కువ స్టాంప్ డ్యూటీ కూడా ఒకటి. వియన్నా కన్వెన్షన్ ప్రకారం, బ్రిటీష్ కాన్సులేట్‌కు దౌత్య పరమైన సడలింపు లభించింది. కాబట్టి అది నామమాత్రపు చెల్లింపుతో (సింబాలిక్ పేమెంట్) సరిపెట్టింది.
గతేడాది రూ.50,000 కోట్లకు పైగా ఆదాయం
మహారాష్ట్ర ప్రభుత్వ అతి పెద్ద ఆదాయ మార్గాల్లో ముంబైలోని రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. ఈ మహా నగరంలో జరిగే ఆస్తి ఒప్పందాల ద్వార ప్రభుత్వ ఖజానాకు చాలా ఆదాయం వస్తుంది. మార్చి 31, 2024తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఒక్క ముంబై స్టాంప్ డ్యూటీ ద్వారానే అక్కడి ప్రభుత్వం రూ. 50,400 కోట్లు ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం కంటే ఇది 13 శాతం ఎక్కువ. GST, అమ్మకపు పన్ను తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కాంట్రిబ్యూట్ చేస్తున్న మూడో అతి పెద్ద ఆదాయ వనరు రియల్ ఎస్టేట్ రంగం.
మరో ఆసక్తికర కథనం: పేపర్లు లేకపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ - కంపెనీలు ఇకపై 'నో చెప్పవు'