News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Foreign Portfolio Investment: FPIల ఫేవరెట్ స్టాక్స్‌, గత ఏడాదిన్నరగా వీటిని కొనడం ఆపలేదు

ఫారినర్లు కొంటున్న స్టాక్స్‌ గత సంవత్సర కాలం నుంచి ర్యాలీ చేస్తున్నాయి, మంచి లాభాలు అందించాయి.

FOLLOW US: 
Share:

Foreign Portfolio Investment: ప్రస్తుతం, ఇండియన్‌ ఈక్విటీల వాల్యుయేషన్లు హై రేంజ్‌లో ఉన్నాయి, అయినా, ఫారిన్‌ ఫండ్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో కొనుగోళ్లను ఆపలేదు. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) గత ఆరు త్రైమాసికాలుగా ITC, రేమండ్, కర్నాటక బ్యాంక్ సహా దాదాపు 40 కంపెనీల్లో తమ వాటాలను స్థిరంగా పెంచుకుంటూనే ఉన్నారు. CMS ఇన్‌ఫో సిస్టమ్స్, సిటీ యూనియన్ బ్యాంక్, HAL, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, చెన్నై పెట్రోలియం షేర్లు కూడా FPIల కిట్టీలో ఉన్నాయి. ఫారినర్లు కొంటున్న స్టాక్స్‌ గత సంవత్సర కాలం నుంచి ర్యాలీ చేస్తున్నాయి, మంచి లాభాలు అందించాయి.

FPIల పోర్ట్‌ఫోలియోల్లో ఉన్న పేర్లలో, బ్లూమ్‌బెర్గ్ అంచనా ప్రకారం, CMS ఇన్‌ఫో సిస్టమ్స్, సిటీ యూనియన్ బ్యాంక్, రేమండ్, స్పందన స్ఫూర్తి, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ వంటివి ఇంకా ర్యాలీ చేసే ఛాన్స్‌ ఉంది. ఇవి ఒక ఏడాదిలో 28% పైగా పెరగొచ్చన్నది బ్రోకరేజ్‌ వేసిన లెక్క.

FPIల టాప్‌-10 ఫేవరెట్ స్టాక్స్‌: 

త్రివేణి టర్బైన్ --- జూన్‌ నాటికి FPI వాటా 26.78% ------- ఒక సంవత్సరం లాభం 55% --------- టార్గెట్‌ ధర రూ. 426

కర్ణాటక బ్యాంక్ --- జూన్‌ నాటికి FPI వాటా 21.03% ------- ఒక సంవత్సరం లాభం 34% --------- టార్గెట్‌ ధర రూ. 197

CMS ఇన్‌ఫో సిస్టమ్స్ --- జూన్‌ నాటికి FPI వాటా 15.27% ------- ఒక సంవత్సరం లాభం 18% --------- టార్గెట్‌ ధర రూ. 467

సిటీ యూనియన్ బ్యాంక్ --- జూన్‌ నాటికి FPI వాటా 25.33% ------- ఒక సంవత్సరం లాభం -28% --------- టార్గెట్‌ ధర రూ. 166

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ --- జూన్‌ నాటికి FPI వాటా 11.91% ------- ఒక సంవత్సరం లాభం 52% --------- టార్గెట్‌ ధర రూ. 3,666

రేమండ్ --- జూన్‌ నాటికి FPI వాటా 17.76% ------- ఒక సంవత్సరం లాభం 20% --------- టార్గెట్‌ ధర రూ. 2,193

AU స్మాల్ ఫైనాన్స్ --- జూన్‌ నాటికి FPI వాటా 41.58% ------- ఒక సంవత్సరం లాభం 12% --------- టార్గెట్‌ ధర రూ. 745

చెన్నై పెట్రోలియం --- జూన్‌ నాటికి FPI వాటా 8.49% ------- ఒక సంవత్సరం లాభం 94% --------- టార్గెట్‌ ధర రూ. 362

అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్ --- జూన్‌ నాటికి FPI వాటా 21.90% ------- ఒక సంవత్సరం లాభం 10% --------- టార్గెట్‌ ధర రూ. 310

ITC --- జూన్‌ నాటికి FPI వాటా 14.50% ------- ఒక సంవత్సరం లాభం 40% --------- టార్గెట్‌ ధర రూ. 481

సాధారణంగా, ఒక గ్లోబల్‌ ఫండ్‌ ఒక స్టాక్‌లో పెట్టుబడులు పెడితే, ఆ కంపెనీ అభివృద్ధికి అవకాశం ఉంది కాబట్టే ఆ కంపెనీ షేర్లను ఫారినర్లు కొంటున్నారని మార్కెట్‌ భావిస్తుంది. అయితే, ఆ స్టాక్‌ గతంలో చూపించినంత సత్తాను భవిష్యత్తులోనూ రిపీట్‌ చేస్తుందన్న గ్యారెంటీ ఉండదు.  

మరో ఆసక్తికర కథనం: చంద్రయాన్‌ రాకెట్‌లా దూసుకెళ్లిన టాటా మోటార్స్‌ DVRలు, భలే ఛాన్స్‌ కొట్టేశారు!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 26 Jul 2023 12:10 PM (IST) Tags: Foreign Portfolio Investment FPI favourite stocks

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం