అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' TCS, L&T, Dr Reddy's, Policybzar

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 31 January 2024: యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ నిన్న ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి సమయానికి ఫెడ్‌ నిర్ణయాలు వెల్లడవుతాయి. కీలకమైన US Fed పాలసీ నిర్ణయాలు, గురువారం నాటి మధ్యంతర బడ్జెట్ (Interim Budget 2024) ప్రకటన నేపథ్యంలో, ఈ రోజు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో ఊగిసలాట ధోరణి ఉండొచ్చు. ఫెడ్ రేట్లు తగ్గే సమయం దగ్గరలో ఉందా, దూరంలో అన్న విషయంపైనే ప్రపంచ మార్కెట్లు దృష్టి పెట్టాయి. కాబట్టి, FOMC మీటింగ్‌ తర్వాత ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ చేసే కామెంట్లు గ్లోబల్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి.

ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 53.5 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 21,618 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ఉన్నాయి. నికాయ్‌ 0.8 శాతం క్షీణించింది. షాంఘై కాంపోజిట్, హ్యాంగ్ సెంగ్, కోస్పి, తైవాన్ మార్కెట్లు 0.3-0.5 శాతం మధ్య తగ్గాయి.

US లేబర్ డేటాలో బలం కనిపించిన తర్వాత, మంగళవారం, US బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సైడ్‌లైన్స్‌లో ట్రేడ్‌ అయ్యాయి. యూఎస్‌ మార్కెట్లలో డౌ జోన్స్ 0.4 శాతం లాభంలో ముగిసింది. నాస్‌డాక్ 0.8 శాతం పడిపోయింది. S&P 500 0.1 శాతం తగ్గింది.

US బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌ 4.019 శాతానికి తగ్గింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అంబుజా సిమెంట్స్, అతుల్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్, DB రియాల్టీ, ఫినో పేమెంట్స్ బ్యాంక్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, IDFC, IRB ఇన్‌ఫ్రా, జిందాల్ స్టీల్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, మారుతి, PSB, శ్రీ సిమెంట్, సన్ ఫార్మా, సుజ్లాన్.

నోవా అగ్రి టెక్: ఈ కంపెనీ ఈ రోజు స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ కానుంది. దీని IPO ఇష్యూ ధర రూ.41.

లార్సెన్ & టూబ్రో (L&T): 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో లార్సెన్ & టూబ్రో నికర లాభం 15 శాతం YoY పెరిగి రూ.2,947 కోట్లకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా దేశీయ మార్కెట్‌లో కొత్త ఆర్డర్లు తగ్గాయని, మరో రెండు త్రైమాసికాల పాటు బలహీనత ఉంటుందని మేనేజ్‌మెంట్‌ చెప్పింది.

డా. రెడ్డీస్: 2023 అక్టోబర్‌-డిసెంబర్‌ కాలంలో 11 శాతం YoY లాభంతో రూ. 1,379 కోట్లు మిగుల్చుకుంది. ఏకీకృత ఆదాయంలో 7 శాతం పెరుగుదలను సూచిస్తూ రూ. 7,215 కోట్లకు చేరింది.

PB ఫిన్‌టెక్: పాలసీబజార్ మాతృ సంస్థ PB ఫిన్‌టెక్, డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ. 37 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ. 87 కోట్ల నికర నష్టంలో ఉంది. ఆదాయం 43 శాతం YoY పెరిగి రూ.871 కోట్లకు చేరుకుంది.

TCS: యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన బీమా వ్యాపార సంస్థ అవివాకు చెందిన వ్యాపారాన్ని ట్రాన్స్‌ఫార్మ్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం 15 సంవత్సరాలు ఉంటుంది.

పెట్రోనెట్ LNG: Q3 FY24లో రూ. 1,190.3 కోట్ల ఏకీకృత నికర లాభం సాధించింది, ఏడాది ప్రాతిపదికన స్వల్పంగా 1.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

కోరమాండల్ ఇంటర్నేషనల్: మురుగప్ప గ్రూప్‌లోని ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం మూడో త్రైమాసికంలో రూ.228 కోట్లుగా లెక్క తేలింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ.527 కోట్ల నుంచి 57 శాతం క్షీణించింది.

SRF: Q3 కన్సాలిడేటెడ్ నెట్‌ ప్రాఫిట్‌ 50 శాతం తగ్గి రూ. 253.43 కోట్లకు దిగి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.511 కోట్లుగా ఉంది.

ఓల్టాస్: అక్టోబర్‌-డిసెంబర్‌ కాలంలో రూ. 27.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇది ఏడాది క్రితం ఇదే కాలంలోని రూ.110.5 కోట్ల నష్టం నుంచి మెరుగుపడింది. ఏకీకృత ఆదాయం 31 శాతం పెరిగి రూ.2,626 కోట్లకు చేరుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగాన్ని లైవ్‌లో ఎప్పుడు, ఎలా చూడాలి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget