Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' ITC, Bajaj Finance, Epack
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 30 January 2024: బడ్జెట్‌కు ముందు, ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎగబాకడంతో సోమవారం బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు 2 శాతం పెరిగాయి. ప్రపంచ సంకేతాలు పచ్చగా ఉన్నందున ఈ రోజు (మంగళవారం) కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ నోట్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ITC, NTPC, బజాజ్ ఫైనాన్స్ Q3 ఫలితాల ఆధారంగా ఇన్వెస్టర్లు ప్రతిస్పందిస్తారు.
ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 04 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 21,959 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో... ఈ ఉదయం కోస్పి 0.8 శాతం ర్యాలీ చేసింది. జపాన్ నికాయ్, సింగపూర్ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం చొప్పున పెరిగాయి.
US ఫెడ్ పాలసీ సమావేశానికి ఒక రోజు ముందు, సోమవారం, అమెరికన్ S&P 500, డౌ జోన్స్ రికార్డు గరిష్ట స్థాయిలలో ముగిశాయి. S&P 500 0.8 శాతం ఎగబాకితే, డౌ జోన్స్ 0.6 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1 శాతానికి పైగా పెరిగింది.
గత అంచనాల కంటే తక్కువ రుణం తీసుకుంటామని US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చెప్పడంతో, బెంచ్‌మార్క్ 10-ఇయర్స్ US ట్రెజరీ బాండ్ ఈల్డ్ 8.6 బేసిస్ పాయింట్లు తగ్గి 4.074 శాతానికి దిగి వచ్చింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
BLS ఇ-సర్వీసెస్: రూ. 311 కోట్ల IPO సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి 01న ముగుస్తుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ.129 - 135 రేంజ్‌లో 2.30 కోట్ల ఫ్రెష్ ఈక్విటీ షేర్ల జారీ చేస్తోంది.
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అదానీ టోటల్ గ్యాస్, బజాజ్ ఫిన్‌సర్వ్, డా.రెడ్డీస్, లార్సెన్ & టూబ్రో (L&T), మహీంద్ర & మహీంద్ర ఫైనాన్స్, NDTV, PB ఫిన్‌టెక్, స్ట్రైడ్స్ ఫార్మా, స్టార్ హెల్త్, VIP ఇండస్ట్రీస్, ఓల్టాస్, కొచ్చిన్ షిప్‌యార్డ్, KEC ఇంటర్నేషనల్, KPIT టెక్నాలజీస్.
ఈప్యాక్ డ్యూరబుల్: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. దీని IPO ఇష్యూ ప్రైస్ రూ.230.
ITC: 2023 డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY24) ఐటీసీ ఏకీకృత నికర లాభం రూ.5,006.65 కోట్ల నుంచి రూ.5,335.23 కోట్లకు (YoY), 6.6 శాతం పెరిగింది.
బజాజ్ ఫైనాన్స్: Q3FY24లో లాభం సంవత్సరానికి 22 శాతం పెరిగి రూ. 3,639 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII), ఫీజులు & కమీషన్లలో మంచి వృద్ధి దీనికి కారణం. NII 29 శాతం పెరిగి రూ.7,655 కోట్లుగా లెక్క తేలింది.
వొడాఫోన్ ఐడియా: 2023 అక్టోబర్-డిసెంబర్ కాలంలో రూ.6,985 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ.7,990 కోట్లతో పోలిస్తే 12.5 శాతం తగ్గించింది. ARPU రూ.145కి పెరిగింది. ఇది గత రెండు త్రైమాసికాల్లో వరుసగా రూ.142, రూ.139గా ఉంది.
NTPC: Q3లో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 7.3 శాతం పెరిగి రూ. 5,209 కోట్లకు చేరుకుంది. అయితే, ఆదాయం గత ఏడాది ఇది కాలంలోని రూ.44,602 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.42,820 కోట్లకు పరిమితమైంది.
మారికో: డిసెంబర్ త్రైమాసిక లాభం YoYలో 16 శాతం పెరిగి రూ.386 కోట్లు మిగిలింది. అయితే, ఆదాయం 1.9 శాతం తగ్గి రూ.2,422 కోట్లుగా రికార్డ్ అయింది.
హావెల్స్ ఇండియా: డెలావేర్‌లోని తన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ హావెల్స్ ఇంటర్నేషనల్‌లో $20 మిలియన్ల వరకు పెట్టుబడి పెడుతోంది. USలో కొత్త వృద్ధి అవకాశాలను అందుకోవడానికి ఈ డబ్బును ఉపయోగిస్తుంది.
పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: 2023 క్యూ3లో రూ. 2,378 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని తలకెత్తుకుంది. 2022 క్యూ3లో రూ. 3,545.4 కోట్ల లాభంలో ఉంది.
KEC ఇంటర్నేషనల్: వివిధ వ్యాపారాల్లో రూ.1,304 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రైతులకు రూ.9 వేలు పీఎం కిసాన్ డబ్బు, బడ్జెట్‌లో ప్రకటించే ఛాన్స్!