Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' RIL, Paytm, Vedanta, Glenmark
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 15 February 2024: గ్లోబల్ మార్కెట్ల నుంచి గట్టి సిగ్నల్స్ అందుకుంటున్న ఇండియన్ ఈక్విటీలు, ఈ రోజు (గురువారం) పాజిటివ్ నోట్‌తో ట్రేడ్‌ను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 08 పాయింట్లు లేదా 0.04 శాతం రెడ్ కలర్‌లో 21,985 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం తైవాన్ 3 శాతానికి పైగా, జపాన్ నికాయ్ 0.7 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.3 శాతం పెరిగాయి. కోస్పి 0.05 శాతం, హాంగ్ సెంగ్ 0.65 శాతం తగ్గాయి.
కార్పొరేట్ ఆదాయాల్లో ఆశ్చర్యకరమైన నంబర్ల కారణంగా, నిన్న, అమెరికన్ బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.4 శాతం, S&P 500 1 శాతం, నాస్‌డాక్ 1.3 శాతం పెరిగాయి.
US 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ మంగళవారం నాటి 4.267 శాతం నుంచి బుధవారానికి 4.235 శాతానికి చేరింది, అతి కొద్దిగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $81 వద్ద కొనసాగుతోంది.
ఈ మధ్యకాలంలో కాయిన్‌బేస్, మారథాన్ డిజిటల్, రియోట్ బిట్‌కాయిన్ వంటి క్రిప్టో స్టాక్స్ విపరీతంగా పెరగడంతో, మార్కెట్ విలువ 2021 నవంబర్ తర్వాత మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్లు దాటింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
రిలయన్స్: టాటా ప్లేలో 29.8 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు వాల్ట్ డిస్నీతో చర్చలు జరుపుతోంది. భారతదేశ టెలివిజన్ రంగంలో లోతుగా పాతుకుపోవడానికి ప్రయత్నిస్తోంది.
పేటీఎం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కేసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయంపై ED సెంట్రల్ బ్యాంక్ నుంచి మరింత వివరణ కోరినట్లు తెలిసింది.
NMDC: Q3 ఏకీకృత లాభం 62.6 శాతం YoY పెరిగింది, రూ. 1,470 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా 45.4 శాతం జంప్‌తో రూ. 5,410 కోట్లకు చేరుకుంది.
గ్లెన్‌మార్క్ ఫార్మా: 2022 డిసెంబర్ త్రైమాసికంలోని రూ.185.80 కోట్ల లాభంతో పోలిస్తే 2023 అదే కాలంలో రూ.449.60 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. ఆదాయం 19.1 శాతం క్షీణించి రూ.2,506.70 కోట్లకు తగ్గింది.
ఉత్కర్ష్ SFB: హోల్డింగ్ కంపెనీ ఉత్కర్ష్ కోర్ ఇన్వెస్ట్ (UCL), బ్యాంక్ మధ్య రివర్స్ మెర్జింగ్ తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో, తదుపరి చర్యలు ప్రారంభించాలని UCL బోర్డు సూచించింది.
వేదాంత: ఈ మైనింగ్ కంపెనీలో, సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను బ్లాక్ డీల్స్ ద్వారా GQG పార్ట్‌నర్స్‌కు వేదాంత మాతృ సంస్థ అమ్ముతోందని సమాచారం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆకాశం నుంచి కిందకు దిగిన గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే