అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Shriram Finance, Zomato, DLF, TCS

Stocks in news Today: ప్రస్తుత పరిస్థితిని బట్టి మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 14 May 2024: సోమవారం, అమెరికన్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా క్లోజ్‌ అయ్యాయి, ఈ ఉదయం ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమ సంకేతాలు పంపుతున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) లాభాల నడుమ ప్రారంభం కావచ్చు. అయితే, బిగ్‌బాయ్స్‌ అమ్మకాలను కీలకంగా చూడాలి. నిన్న, ఎఫ్‌ఐఐలు రూ.4,498.92 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. డీఐఐలు రూ.3,562.75 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.

మన దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతూనే ఉన్నప్పటికీ, ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతానికి స్వల్పంగా తగ్గింది. మార్చి నెలలో ఇది 4.85 శాతం వద్ద ఉంది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఈ డేటా విడుదలైంది.

సోమవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,104 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,262 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, హాంగ్ సెంగ్ 0.9 శాతం, షాంఘై కాంపోజిట్ 0.24 శాతం, నికాయ్‌ 0.01 శాతం పెరిగాయి. కోస్పి, ASX200 ఇండెక్స్‌ 0.2 శాతం వరకు తగ్గాయి.

అమెరికన్‌ మార్కెట్లలో, సోమవారం, డౌ జోన్స్ 0.21 శాతం పడిపోయింది, S&P 500 0.02 శాతం తగ్గింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.29 శాతం పెరిగింది.

అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.5% కంటే దిగువన, 4.487% వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కొద్దిగా పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 పైన కదులుతోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఔన్సుకు $2,347 డాలర్లకు పెరిగింది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఆర్కియన్ కెమికల్, AIA ఇంజినీరింగ్, ఆంధ్ర పేపర్, అపార్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, ఆరియన్‌ప్రో సొల్యూషన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, BASF ఇండియా, భారతి ఎయిర్‌టెల్, భారతి హెక్సాకామ్, BLS ఇంటర్నేషనల్, బటర్‌ఫ్లై గాంధీమతి, కోల్గేట్ పామోలివ్, దేవయాని ఇంటర్నేషనల్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, HP అడెసివ్స్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, జూబిలెంట్ ఇంగ్రేవియా, కిర్లోస్కర్ బ్రదర్స్,
మన్ ఇన్‌ఫ్రాకన్‌స్ట్రక్షన్, మిర్కో ఎలక్ట్రానిక్స్, ఒబెరాయ్ రియాల్టీ, ఆన్‌మొబైల్ గ్లోబల్, పతంజలి ఫుడ్స్, PVR ఐనాక్స్, రాడికో ఖైతాన్, శ్రీ సిమెంట్, సిమెన్స్, థైరోకేర్ టెక్నాలజీస్, జైడస్ వెల్నెస్.

జొమాటో: ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో సోమవారం నాడు తన Q4 FY24 ఫలితాలను ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలంలోని రూ. 189 కోట్ల నష్టంతో పోలిస్తే, ఇప్పుడు లాభం రూ. 175 కోట్ల లాభాన్ని ఆర్జింతింది. కంపెనీ ఆదాయం, EBITDA వరుసగా రూ. 3,562 కోట్లు & రూ. 86 కోట్లుగా ఉన్నాయి. Q4లో మార్జిన్ 2.4 శాతంగా ఉంది.

DLF: 2024 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని (Q4 FY23) రూ. 570 కోట్ల నుంచి ఇప్పుడు 61.5 శాతం పెరిగి రూ. 920.7 కోట్లకు చేరుకుంది. ఆదాయం ఏడాది క్రితం ఉన్న రూ. 1,456 కోట్ల నుంచి రూ. 2,135 కోట్లకు, 46.6 శాతం పెరిగింది. మార్జిన్ కూడా 790 బేసిస్ పాయింట్ల జంప్‌తో 35.3 శాతానికి విస్తరించింది.

సనోఫీ: నాలుగో త్రైమాసికం ఆదాయాలు నిరుత్సాహపరిచాయి. ఆదాయం భారీగా 74.3 శాతం (YoY) క్షీణించి, రూ. 2,851.1 కోట్ల నుంచి రూ. 732.4 కోట్లకు పడిపోయింది. ఎబిటా 73 శాతం తగ్గి రూ. 804 కోట్ల నుంచి రూ. 219 కోట్లకు దిగి వచ్చింది.

శ్రీరామ్ ఫైనాన్స్: తన హౌసింగ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్‌ను రూ. 4,630 కోట్లకు వార్‌బర్గ్ పిన్‌కస్‌కు విక్రయించడానికి శ్రీరామ్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

TCS: పారిస్‌లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించినట్లు ఛూజ్ ఫ్రాన్స్ సమ్మిట్ సందర్భంగా ఈ IT సేవల సంస్థ ప్రకటించింది.

మారుతి సుజుకి: దిగ్గజ కార్ల కంపెనీ మారుతి, తన Fronx మోడల్‌లో రెండు కొత్త వేరియంట్లను పోటీ ధరలతో రిలీజ్‌ చేసింది. కొత్త లాంచ్‌లు.. Fronx ISS డెల్టా+ (O) 1.2L 5MT, ధర రూ. 8,93,000 (ఎక్స్‌ షోరూమ్‌) & Fronx ISS డెల్టా+ (O) 1.2L AGS, ధర రూ. 9,43,000 (ఎక్స్‌ షోరూమ్‌).

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Viral Video: జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచిన కోడి - వైరల్ వీడియో
జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచిన కోడి - వైరల్ వీడియో
Embed widget