అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' RIL, Gopal Snacks, TaMo, Fed Bank

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 14 March 2024: బుధవారం నాటి భారీ రక్తపాతం తర్వారత, ఈ రోజు (గురువారం) ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు కాస్తయినా స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి హననంలో పెట్టుబడిదార్ల సంపద రూ.13.5 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ రోజు F&O వారపు కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది, గ్లోబల్ సంకేతాలు కూడా ఇండెక్స్‌లను అస్థిరంగా కదిలేలా చూడవచ్చు.

ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 08 పాయింట్లు లేదా 0.04 శాతం రెడ్‌ కలర్‌లో 22,049 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ASX200, నికాయ్‌ 0.35 శాతం వరకు క్షీణించగా, కోస్పి, హ్యాంగ్ సెంగ్, షాంఘై కాంపోజిట్ 0.5 శాతం వరకు పెరిగాయి. నిన్న, అమెరికాలో, S&P500 0.19 శాతం దిగువన ముగిసింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.54 శాతం నష్టపోయింది. వీటికి విరుద్ధంగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.1 శాతం పెరిగింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

గోపాల్ స్నాక్స్: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతాయి. IPO సమయంలో ఒక్కో షేర్‌ ఇష్యూ ధర రూ.401.

రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ.4,286 కోట్ల మొత్తంతో, వయాకామ్ 18 మీడియాలో రెండో దఫా వాటాను కొనుగోలు చేసేందుకు, పారామౌంట్ గ్లోబల్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థలతో రిలయన్స్‌ ఒక బైండింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్: భారత సైన్యం, కోస్ట్ గార్డ్ కోసం 34 అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు &అనుబంధ పరికరాల కొనుగోలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ రూ.8,073 కోట్ల విలువైన రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది.

KEC ఇంటర్నేషనల్: తన వివిధ వ్యాపారాల కోసం రూ.2,257 కోట్ల విలువైన ఆర్డర్‌లు పొందింది.

టాటా మోటార్స్: రూ.9,000 కోట్ల పెట్టుబడితో ఒక వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వంతో MoU మీద సంతకం చేసింది.

DLF: చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, చెన్నైలో 4.67 ఎకరాల భూమిని DLF లిమిటెడ్ నుంచి రూ.735 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు, డెట్ సెక్యూరిటీల ద్వారా రూ.600 కోట్ల నిధులు సేకరించాలని నిర్ణయించింది.

సోమ్ డిస్టిలరీస్: స్టాక్ స్ప్లిట్/షేర్ల సబ్-డివిజన్‌ను పరిశీలించడం కోసం కంపెనీ డైరెక్టర్లు ఏప్రిల్ 02న సమావేశం అవుతారు.

గ్రాసిమ్ ఇండస్ట్రీస్: రూ.1,250 కోట్ల నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ కోసం డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.

ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్: కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల జారీని ఆపేయాలని ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్‌లను RBI ఆదేశించింది.

హడ్కో: 2024 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలించేందుకు ఈ నెల 20వ డైరెక్టర్లు సమావేశమవుతారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: కాస్త ఊరటనిచ్చిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Embed widget