అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Paytm, Nykaa, ONGC, Britannia

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 07 February 2024: గ్లోబల్ ఈక్విటీలు బలంగా పెరగడంతో, ఈ రోజు (బుధవారం) ఇండియన్‌ ఈక్విటీలు కూడా ఉత్సాహంగా ట్రేడ్‌ ప్రారంభించే అవకాశం ఉంది. మేజర్‌ కంపెనీల Q3 ఫలితాలకు అనుగుణంగా ఇన్వెస్టర్లు స్పందిస్తారు కాబట్టి, ఈ రోజు కూడా స్టాక్ స్పెసిఫిక్‌ యాక్షన్‌ కొనసాగుతుంది.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 04 పాయింట్లు లేదా 0.02 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,116 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

నిన్న ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మూడు రోజుల ద్రవ్య విధాన సమావేశం (MPC) రేపటి వరకు కొనసాగుతుంది. రేపు ఉదయం 11 సమయంలో వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడుతుంది. దేశంలో వడ్డీ రేట్లు ఈసారి కూడా మారవని మార్కెట్‌ భావిస్తోంది.

గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం, ఆసియాలో నికాయ్‌ తప్ప మిగిలిన మేజర్‌ మార్కెట్లు పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నాయి. హాంగ్ సెంగ్, కోస్పి, ASX 200 ఇండెక్స్‌లు 0.7-1.8 శాతం వరకు పెరిగాయి, బలం ప్రదర్శిస్తున్నాయి. నిక్కీ ఫ్లాట్‌ లైన్ దిగువన ట్రేడవుతోంది.

నిన్న, US మార్కెట్లలో S&P 500 0.23 శాతం పెరిగింది. డౌ జోన్స్‌ 0.37 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.07 శాతం గెయిన్‌ అయింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఆర్తి ఫార్మాలాబ్స్, AIA ఇంజినీరింగ్, అపోలో టైర్స్, అశోక బిల్డ్‌కాన్, ఆదిత్య విజన్, బోరోసిల్ రెన్యూవబుల్స్, కమిన్స్ ఇండియా, డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా, EPL, FDC, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్, GMR పవర్ అండ్‌ అర్బన్ ఇన్‌ఫ్రా, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్, HBL పవర్ సిస్టమ్స్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, HMT, ఇండియా పెస్టిసైడ్స్, జమ్నా ఆటో ఇండస్ట్రీస్, JK పేపర్, కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, లుపిన్, మణప్పురం ఫైనాన్స్, నవనీత్ ఎడ్యుకేషన్, నెస్లే ఇండియా, నోసిల్, PDS, పికాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రొటీన్ ఇగోవ్ టెక్నాలజీస్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, సఫారీ ఇండస్ట్రీస్ (ఇండియా), సంఘ్వి మూవర్స్, శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్, షాల్బీ, శోభా, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, స్టార్ సిమెంట్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్, UNO మిండా, వరోక్ ఇంజినీరింగ్.

పేటీఎం: ప్రస్తుతం ఉన్న అన్ని లావాదేవీలను మార్చి 15లోపు సెటిల్‌ చేసిన తర్వాత, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయడం లేదా దాని బోర్డును మార్చే విషయం RBI పరిశీలనలో ఉందని తెలుస్తోంది. పేటీఎం ఫౌండర్‌ విజయ్ శేఖర్ శర్మ, మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమై, తన కంపెనీపై జరుగుతున్న దాడి గురించి వివరించినట్లు సమాచారం. ఆర్‌బీఐతోనూ సమావేశమై నిబంధనల గురించి, కంపెనీ పరిస్థితి గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మరో 6 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్‌కు IRDAI అనుమతి ఇచ్చింది. 

కోటక్ మహీంద్రా బ్యాంక్: కోటక్ మహీంద్ర జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటా కొనుగోలుకు జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీకి (ZIC ) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది.

బ్రిటానియా ఇండస్ట్రీస్: Q3FY24లో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 40 శాతం తగ్గి రూ.556 కోట్లకు చేరుకుంది. ఆదాయం 1 శాతం పెరిగి రూ. 4,256 కోట్లకు చేరుకుంది.

UPL: మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్, UPL కార్పొరేషన్ సీనియర్ అన్‌సెక్యూర్డ్ రేటింగ్‌ను BA1 నుంచి BAA3కి, దీర్ఘకాలిక జూనియర్ సబార్డినేటెడ్ బాండ్‌లపై రేటింగ్‌ను BA2 నుంచి BA3 తగ్గించింది.

FSN ఇ-కామర్స్ వెంచర్స్: నైకా మాతృ సంస్థ FSN ఇ-కామర్స్ వెంచర్స్, Q3లో ఏకీకృత నికర లాభాన్ని దాదాపు రెట్టింపు చేసి రూ. 16.2 కోట్లకు చేరుకుంది.

ONGC: టోటల్ ఎనర్జీస్‌కు చెందిన AUSEA సాంకేతికతను ఉపయోగించి మీథేన్ ఉద్గారాల గుర్తింపు కోసం టోటల్ ఎనర్జీస్‌తో ONGC ఒప్పందం కుదుర్చుకుంది.

KRBL, LT ఫుడ్స్: కిలోకు రూ.29కే 'భారత్ రైస్'ని ప్రారంభం సందర్భంగా LT ఫుడ్స్, KRBL, చమన్ లాల్ సెటియా, కోహినూర్ ఫుడ్స్, GRM ఓవర్సీస్ వంటి బియ్యం కంపెనీల షేర్లు రియాక్ట్‌ కావచ్చు. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: రూ.63 వేలకు దిగొచ్చిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
Mahindra Thar: థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
Samantha: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
Embed widget