Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Banks, Auto, Sobha, Equitas SFB
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 05 April 2024: గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీనమైన సూచనల నడుమ ఈ రోజు (శుక్రవారం) ట్రేడింగ్ సెషన్ చప్పగా ప్రారంభం కావచ్చు. ఉదయం 10 గంటలకు వెలువడే ఆర్‌బీఐ పాలసీ ప్రకటనపై స్టాక్ మార్కెట్ దృష్టి పెడుతుంది.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 46 పాయింట్లు లేదా 0.20 శాతం రెడ్ కలర్‌లో 22,531 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభమవుతుందన్న అంచనాలపై ఫెడ్ అధికారులు హెచ్చరించడం, ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పడంతో US మార్కెట్‌లో ట్రెండ్ తారుమారైంది. అమెరికన్ ఇండెక్స్‌లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. ఈ రాత్రికి వెలువడే జాబ్ రిపోర్ట్ మీదకు ఇప్పుడు ఫోకస్ మారింది.
అమెరికన్ మార్కెట్లలో.. S&P 500, డౌ జోన్స్, నాస్‌డాక్ తలా 1 శాతానికి పైగా పడిపోయాయి.
ఆసియా మార్కెట్లలో నికాయ్ 2% పైగా పడిపోయింది. తైవాన్, కోస్పి తలో 0.7 శాతం చొప్పున నష్టపోయాయి.
అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.312 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $91 చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,290 దగ్గర ఉంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
రేట్ సెన్సిటివ్ స్టాక్స్: FY25లో మొదటి రెపో రేటు నిర్ణయాన్ని RBI ఈ ఉదయం 10 గంటల తర్వాత ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక, వాహన, స్థిరాస్తి కంపెనీల షేర్లు మార్కెట్ రాడార్‌లో ఉంటాయి.
HDFC బ్యాంక్: Q4FY24లో బ్యాంక్ మంచి సంఖ్యలను పోస్ట్ చేసిన తర్వాత, గురువారం, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NYSE)లో HDFC బ్యాంక్ ADR 5 శాతం పెరిగింది. నిన్న, దేశీయ మార్కెట్‌లో ఈ షేరు 3 శాతం లాభపడింది.
బజాజ్ ఫైనాన్స్: ఈ నాన్-బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) Q4FY24లో 3.23 మిలియన్ కస్టమర్లను యాడ్ చేసుకుంది, మొత్తం కస్టమర్ ఫ్రాంచైజీని 83.64 మిలియన్లకు తీసుకువెళ్లింది. మార్చి త్రైమాసికంలో కొత్త రుణాలు YoY 4 శాతం పెరిగి 7.87 మిలియన్లకు చేరాయి. AUM 34 శాతం పెరిగి రూ. 3.3 ట్రిలియన్‌లకు చేరుకుంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్: మార్చి త్రైమాసికంలో బ్యాంక్ 18 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి అడ్వాన్స్‌లను రూ.3.43 లక్షల కోట్లకు చేర్చింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్లు 14 శాతం పెరిగి రూ.3.85 లక్షల కోట్లకు చేరాయి.
నెస్లే ఇండియా: మ్యాగీ నూడుల్స్ విక్రయాల్లో నెస్లే ఇండియా న్యాయబద్ధంగా నడుచుకోవడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యూదిల్లీలోని 'నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్' (NCDRC) తోసిపుచ్చింది.
సెల్లో వరల్డ్: తయారీ సామర్థ్యాలను పెంచడానికి రాజస్థాన్‌లో గ్లాస్‌వేర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.
శోభ: Q4FY24లో అమ్మకాల విలువ 2.8 శాతం పెరిగి రూ.1,504 కోట్లకు చేరిందని ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ చెప్పింది. Q4FY24లో సగటు ధర రియలైజేషన్ 13.5 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.11,230కి చేరుకుంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: Q4FY24లో ఈ SFB గ్రాస్ అడ్వాన్స్‌లు 23 శాతం YoY, 5 శాతం QoQ పెరిగి రూ. 34,337 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం డిపాజిట్లు కూడా 43 శాతం YoY, 12 శాతం QoQ పెరిగి రూ.36,129 కోట్లుగా నమోదయ్యాయి. CASA డిపాజిట్లు 8 శాతం YoY, 9 శాతం QoQ పెరిగి రూ. 11,552 కోట్లకు చేరాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రాహుల్ గాంధీ దగ్గర 24 కంపెనీల షేర్లు, బంగారంలోనూ పెట్టుబడులు