అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rahul Investments: రాహుల్‌ గాంధీ దగ్గర 24 కంపెనీల షేర్లు, బంగారంలోనూ పెట్టుబడులు

స్టాక్ మార్కెట్‌లో షేర్లను నేరుగా కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, పరోక్షంగా మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టారు.

Rahul Gandhi Portfolio: అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ వాయనాడ్‌ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌లో భాగంగా తన ఆస్తిపాస్తుల వివరాలను రాహుల్ గాంధీ వెల్లడించారు. తన దగ్గర వివిధ కంపెనీలకు చెందిన రూ. 4.33 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని అఫిడవిట్‌లో రాహుల్‌ ప్రకటించారు.

అన్ని రకాల ఆస్తుల్లో రాహుల్‌ పెట్టుబడులు
ఒక అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారు తరహాలో, అన్ని రకాల ఆస్తి తరగతుల్లో రాహుల్ గాంధీ పెట్టుబడులు పెట్టారు. స్టాక్ మార్కెట్‌లో షేర్లను నేరుగా కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, పరోక్షంగా మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి సావరిన్ గోల్డ్ బాండ్లు కూడా ఉన్నాయి.

రాహుల్ పోర్ట్‌ఫోలియోలో బ్లూ చిప్ కంపెనీల స్టాక్స్‌
రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 24 కంపెనీల షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ.4.33 కోట్లు. ఈ లిస్ట్‌లో... 1,474 పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు ఉన్నాయి, ఇది ఫెవికాల్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తోంది. రాహుల్‌ వద్ద ఉన్న ఈ కంపెనీ షేర్ల విలువ రూ. 42,27,432. మల్టీబ్యాగర్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ షేర్లను కూడా రాహుల్ కొనుగోలు చేశారు. బజాజ్ ఫైనాన్స్‌లో ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌కు మొత్తం 551 షేర్లు ఉన్నాయి, వాటి విలువ రూ. 38,89,407. నెస్లే ఇండియాలో 1,370 షేర్లు ఉన్నాయి, వాటి విలువ రూ. 35,67,001. ఏషియన్ పెయింట్స్‌కు చెందిన 1231 షేర్లు ఉన్నాయి, వాటి విలువ రూ. 35,29,954. టైటన్‌ షేర్లను కూడా రాహుల్‌ కొనుగోలు చేశారు. అతని పెట్టుబడుల లిస్ట్‌లో 897 టైటన్‌ షేర్లు ఉన్నాయి, వాటి విలువ రూ. 32.59 లక్షలు.

రసాయనాలు - ఐటీ రంగంలో అత్యధిక పెట్టుబడులు
రాహుల్ పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే... అతను లార్జ్ క్యాప్, మిడ్‌ క్యాప్, స్మాల్ క్యాప్ - ఈ వర్గాల్లో ఇన్వెస్ట్‌ చేశారు. FMCG రంగంలోని మూడు దిగ్గజాలు HUL, ITC, నెస్లే షేర్లు రాహుల్‌ దగ్గర ఉన్నాయి. అంతేకాదు, బ్రిటానియాకు చెందిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు కూడా ఉన్నాయి. ఐటీ రంగంలో.. ఇన్ఫోసిస్, TCS, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోడ్జ్ ఇండియా షేర్లు ఉన్నాయి. ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే.. ICICI బ్యాంక్‌లో 2,299 షేర్లు ఉన్నాయి, వాటి విలువ రూ. 24,83,725.

తన పోర్ట్‌ఫోలియోలో రసాయనాల రంగానికి రాహుల్ పెద్ద పీట వేశారు. కెమికల్స్ కంపెనీల్లో... ఆల్కైల్ అమిన్స్ కెమికల్స్, దీపక్ నైట్రేట్, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, వినైల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్స్ రాహుల్‌ జేబులో ఉన్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో... దివీస్ ల్యాబ్‌లో రూ.19.76 లక్షలు, డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్‌లో రూ.10.43 లక్షల విలువైన షేర్లు ఉన్నాయి.

అఫిడవిట్‌ ప్రకారం, రాహుల్ గాంధీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 3,81,33,572 పెట్టుబడి పెట్టారు. అతని అతి పెద్ద పెట్టుబడి HDFC స్మాల్ క్యాప్ ఫండ్‌లో ఉంది, దీనిలో అతని పెట్టుబడి మార్కెట్ విలువ రూ. 1,23,85,545. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ గ్రోత్‌లో పెట్టిన పెట్టుబడి విలువ రూ. 1.02 కోట్లు. 

రాహుల్ గాంధీ బంగారంలోనూ ఇన్వెస్ట్‌ చేశారు. అతని దగ్గర 220 యూనిట్ల (220 గ్రాములు) సావరిన్ గోల్డ్ బాండ్లు ఉన్నాయి, వాటి విలువ రూ. 15,21,740.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడీ వ్యక్తి - అంబానీ, అదానీ నంబర్‌ ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget