అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Auto stocks, LIC, SJVN

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 02 January 2024: ఇండియన్‌ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజు (మంగళవారం, 02 జనవరి 2023) కూడా ఫ్లాట్‌గా ప్రారంభమవుతాయన్న సిగ్నల్స్‌ ఇస్తున్నాయి. 

సోమవారం ఆఖరి అరగంటలో వచ్చిన భారీ సెల్లాఫ్‌ కారణంగా మన మార్కెట్లు లాభాలను కోల్పోయి, ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ రోజు కూడా గ్లోబల్ ట్రిగ్గర్స్ లేకపోవడంతో స్టాక్‌ స్పెసిఫిక్‌గా మార్కెట్‌ కదులుతుంది. 

ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. హాంగ్ సెంగ్, CSI 300 0.9 శాతం వరకు క్షీణించాయి. కోస్పి 0.07 శాతం పతనమైంది. ASX 200 0.22 శాతం పెరిగింది. జపాన్‌లో భారీ భూకంపం వల్ల సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి మార్కెట్లు మూతపడ్డాయి. జనవరి 01 కారణంగా నిన్న అమెరికన్‌ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 17 పాయింట్లు లేదా 0.08% రెడ్‌ కలర్‌లో 21,856 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

SJVN: భారత్‌, నేపాల్‌లో హైడ్రో & పునరుత్పాదక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నాలుగు జాయింట్ వెంచర్ కంపెనీలను ఏర్పాటు చేయాలని ఈ కంపెనీలు & కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు దీపమ్‌ (DIPAM) అంగీకరించింది.

ఐషర్ మోటార్స్: 2023 డిసెంబర్‌ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాలు 7% తగ్గి 63,387 యూనిట్లకు పరిమితమయ్యాయి, నవంబర్‌ నెలలో నెలలో 68,400 యూనిట్లు సేల్‌ అయ్యాయి.

TVS మోటార్: డిసెంబర్ 2022 నెలలోని 2,42,012 యూనిట్ల సేల్స్‌తో పోలిస్తే, డిసెంబర్ 2023లో 3,01,898 యూనిట్లను TVS మోటార్ అమ్మింది. ఇది 25% YoY వృద్ధి. 

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC): మహారాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ + పెనాల్టీతో కలిపి రూ. 806 కోట్ల GST చెల్లించాలని సూచించే కమ్యూనికేషన్/డిమాండ్ ఆర్డర్‌ను LIC ఎదుర్కొంటోంది.

HUL: హిందుస్థాన్‌ యూనిలీవర్‌కు కూడా రూ.447 కోట్ల విలువైన టాక్స్‌ నోటీసు అందింది.

GR ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్: టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ (TBCB) ద్వారా "మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ (1000 MW) సెజ్‌లో RE ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ప్రసారం కోసం ట్రాన్స్‌మిషన్ సిస్టమ్-ఫేజ్ II" కోసం విజయవంతమైన బిడ్డర్‌గా GR ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ అవతరించింది, లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ అందుకుంది.

APL అపోలో ట్యూబ్స్‌: APL అపోలో ట్యూబ్స్ Q3 FY24లో 6,03,659 టన్నుల అమ్మకాలను రిపోర్ట్‌ చేసింది. Q3 FY23లో ఇది 6,05,049 టన్నులు, Q2 FY24లో 6,74,761 టన్నులుగా ఉంది.

ధనలక్ష్మి బ్యాంక్: 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ధనలక్ష్మి బ్యాంక్ గ్రాస్‌ అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన (YoY) 11% వృద్ధితో రూ. 10,350 కోట్లకు చేరాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: కొత్త ఏడాది తొలి రోజునే జనాల్ని వెర్రివాళ్లను చేసిన గ్యాస్‌ కంపెనీలు, ఇదేం చోద్యం?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget