News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Stocks Watch Today, 30 May 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' ITC, Vedanta, Adani Ports

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stock Market Today, 30 May 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 13 పాయింట్లు లేదా 0.07 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,703 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, మ్యాన్‌కైండ్ ఫార్మా. ఈ షేర్లపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

మోంటే కార్లో ఫ్యాషన్స్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో మోంటే కార్లో ఫ్యాషన్స్ రూ. 19.8 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 237 కోట్ల ఆదాయం వచ్చింది.

బెస్ట్‌ ఆగ్రోలైఫ్: 2022-23 నాలుగో త్రైమాసికంలో బెస్ట్ ఆగ్రోలైఫ్‌కు రూ. 8.4 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో ఈ కంపెనీకి రూ. 254 కోట్ల ఆదాయం వచ్చింది.

వేదాంత, ITC: వేదాంత, ఐటీసీ కంపెనీల షేర్లు ఈరోజు ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్‌ అవుతాయి. అంటే, ఆయా కంపెనీలు ప్రకటించిన డివిడెండ్‌ మేరకు షేర్‌ ధర తగ్గిపోతుంది.

NBCC (ఇండియా): జనవరి-మార్చి కాలంలో NBCC (ఇండియా) రూ. 108 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,790 కోట్లుగా ఉంది.

రైల్‌ వికాస్ నిగమ్: నాలుగో త్రైమాసికంలో రైల్ వికాస్ నిగమ్ రూ. 359 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 5,719 కోట్ల ఆదాయాన్ని ఈ సంస్థ సంపాదించింది.

టొరెంట్ పవర్: జనవరి-మార్చి కాలానికి టొరెంట్ పవర్ రూ. 450 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ. 6,038 కోట్ల ఆదాయం ఆర్జించింది.

శోభ: మార్చి త్రైమాసికంలో శోభ రూ. 48.6 కోట్ల నికర లాభం మిగుల్చుకుంది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,209 కోట్లుగా ఉంది.

జూబిలెంట్ ఫార్మోవా: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జూబిలెంట్ ఫార్మోవా రూ. 98 కోట్ల నికర నష్టాన్ని నెత్తిన వేసుకుంది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 1,660 కోట్లు.

IRCTC: ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన కేటరింగ్‌ & టికెటింగ్ విభాగమైన IRCTC, 2023 మార్చి త్రైమాసికంలో రూ. 279 కోట్ల స్వతంత్ర నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 30% వృద్ధి.

ఇది కూడా చదవండి: మళ్లీ ఐదో స్థానంలోకి ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌, వెనక్కు తగ్గిన ఫ్రాన్స్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 30 May 2023 08:19 AM (IST) Tags: Shares stocks in news Stock Market Buzzing stocks Q4 Results

ఇవి కూడా చూడండి

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్‌ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోండి

Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్‌ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోండి

Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ