Stocks To Watch 28 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' RailTel, IOC, SBI Card
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 28 July 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 17 పాయింట్లు లేదా 0.09 శాతం గ్రీన్ కలర్‌లో 19,781 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: IOC, SBI కార్డ్, మారికో, మహీంద్ర ఫైనాన్స్. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్ విభాగమైన 'అదానీ న్యూ ఇండస్ట్రీస్', బార్ల్కేస్, డ్యూయిష్ బ్యాంక్ నుంచి $394 మిలియన్ల (రూ. 3,231 కోట్లు) రుణం సేకరించింది.
BEL: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్ ఎలక్ట్రానిక్స్ రూ.531 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే కాలానికి ఆదాయం రూ.3511 కోట్లుగా ఉంది.
రైల్‌టెల్: తొలి త్రైమాసికంలో రైల్‌టెల్ రూ. 38.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రూ. 468 కోట్ల ఆదాయం సంపాదించింది.
శ్యామ్ మెటాలిక్స్: Q1లో ఈ కంపెనీ నికర లాభం 43% తగ్గి రూ. 237 కోట్లకు చేరుకోగా, ఆదాయం 3% పెరిగి రూ.3,307 కోట్లు నమోదైంది.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్: ఏప్రిల్-జూన్ కాలానికి గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ.33 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 515 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇండియన్ హోటల్స్: జూన్ త్రైమాసికంలో ఇండియన్ హోటల్స్ నికర లాభం 31% పెరిగి రూ. 222 కోట్లకు చేరుకోగా, ఆదాయం 16% పెరిగి రూ.1,466 కోట్లకు చేరుకుంది.
ట్రైడెంట్: మొదటి త్రైమాసికంలో ట్రైడెంట్ లాభం 29% తగ్గింది. కీలకమైన నూలు విభాగంలో బలహీనమైన డిమాండ్ కారణంగా దెబ్బతింది.
అజంతా ఫార్మా: ఒక్కో షేరు మీద రూ. 15 ప్రత్యేక డివిడెండ్, రూ. 10 సాధారణ డివిడెండ్‌ను ఈ ఫార్మా కంపెనీ ప్రకటించింది.
ఇప్కా ల్యాబ్స్: యూనికెమ్ ల్యాబ్స్ వాటాను ఇప్కా ల్యాబ్స్ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం లభించింది.
వెల్‌స్పన్ ఎంటర్ప్రైజెస్: వాటా కొనుగోలు ఒప్పందం ద్వారా మిచిగాన్ ఇంజినీర్స్‌లో 50.10% వాటాను వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది.
ఇండస్ టవర్స్: తొలి త్రైమాసికంలో ఇండస్ టవర్స్ నికర లాభం QoQ 3% పడిపోయి రూ. 1,348 కోట్లకు చేరుకోగా, ఆదాయం 5% పెరిగి రూ. 7,076 కోట్లకు చేరుకుంది.
మోతీలాల్ ఓస్వాల్: Q1లో ఈ బ్రోకింగ్ కంపెనీ లాభం అనేక రెట్లు పెరిగి రూ. 526 కోట్లకు చేరుకోగా, వడ్డీ 56% పెరిగి రూ. 400 కోట్లకు చేరుకుంది.
ఇది కూడా చదవండి: ఒక్క ప్రీమియంతో జీవితాంతం నెలకు ₹20 వేలు ఆదాయం, పెట్టుబడి కూడా వెనక్కి - ఇంతకంటే ఏం కావాలి?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial