By: ABP Desam | Updated at : 27 Jul 2023 05:38 PM (IST)
ఒక్క ప్రీమియం కడితే చాలు, నెలకు ₹20 వేలు డ్రా చేయొచ్చు
LIC Jeevan Akshay Policy: భారత దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC), ప్రజల కోసం చాలా రకాల పాలసీలు రన్ చేస్తోంది. మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా కొత్త ప్లాన్స్‌ను కూడా ఎప్పటికప్పుడు ప్రారంభిస్తోంది. దీర్ఘకాలిక పొదుపుగా, పెట్టుబడిగా, కష్ట కాలంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేలా, ఆదాయ పన్ను ఆదా రూపంలో... ఇలా రకరకాల స్కీమ్స్‌ను ఎల్‌ఐసీ అమలు చేస్తోంది.
ఎల్‌ఐసీ పథకాల్లో బెస్ట్ పాలసీ అని ప్రజలు చెప్పుకునే స్కీమ్ ఒకటి ఉంది. ఆ పాలసీ చాలా ఫేమస్ కూడా. ఆ ఎల్‌ఐసీ పథకం పేరు 'ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ' (LIC Jeevan Akshay Policy). ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు.
ఈ పాలసీ తీసుకుంటే, కేవలం ఒక్కసారి ప్రీమియం (Single Premium) కడితే చాలు. అంటే, కట్టాల్సిన డబ్బు మొత్తాన్ని వన్ టైమ్ పేమెంట్ (One time payment) చేయాలి. నిర్ణీత కాలం తర్వాత, ప్రతి నెలా 20 వేల రూపాయల మొత్తాన్ని ఈ స్కీమ్ తిరిగి ఇస్తుంది, మీ జీవితాంతం పే చేస్తుంది.
జీవన్ అక్షయ్ పాలసీ గురించి పూర్తి వివరాలు:
- రిస్క్ లేని, ఎలాంటి టెన్షన్ లేని పెట్టుబడి మార్గం కోసం చూస్తున్న వాళ్లకు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పథకం ఒక మంచి ఆప్షన్.
- ఈ పాలసీని కొనుగోలు చేయాలంటే, మీ వయస్సు 30 నుంచి 85 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో (ఎల్‌ఐసీ ఏజెంట్ ద్వారా) ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
- సింగిల్ అకౌంట్ మాత్రమే కాదు, మరొకరితో కలిసి జాయింట్‌గానూ జీవన్ అక్షయ్ పాలసీ తీసుకునే ఆప్షన్ ఉంది.
- సింగిల్ ప్రీమియం ప్లాన్ కాబట్టి, దీనిలో కనీస పెట్టుబడి ఒక లక్ష రూపాయలు.
- జాయింట్‌గా పాలసీ తీసుకుంటే, ప్రతి ఒక్కరు కనీసం లక్ష రూపాయలు కట్టాలి.
- ఈ స్కీమ్‌లో నెలకు మినిమమ్ రూ. 12 వేలు చేతికి వస్తుంది.
- నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి చొప్పున డబ్బు తీసుకోవచ్చు.
- పెట్టుబడి పెట్టిన నిర్ణీత కాలం తర్వాత, ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు తిరిగి పొందుతారు. మీ పెట్టుబడి ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది.
- జీవన్ అక్షయ్ పాలసీ కింద 10కి పైగా యాన్యుటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పాలసీ ప్రారంభంలోనే, గ్యారెంటీ యాన్యుటీ రేట్ ఎంతో పాలసీదారుకు తెలుస్తుంది.
- పాలసీదారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి నెలవారీ రాబడి కొద్దిగా మారుతుంది.
- పాలసీదారుకి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం ఇందులో ఉంది.
- ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే పెన్షన్ ఆగిపోతుంది, నామినీకి పెట్టుబడి తిరిగి వస్తుంది.
- ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
నెలకు రూ.20 వేల పెన్షన్ కోసం ఎంత ప్రీమియం?
ఒక పెట్టుబడిదారు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీలో సింగిల్ ప్రీమియంగా రూ. 9,16,200 జమ చేస్తే.. నెలకు రూ. 6,859 చేతికి వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి రూ. 86,265... ఆరు నెలలకు రూ. 42,008... మూడు నెలలకు రూ. 20,745 పొందుతారు. నెలనెలా 20 వేల రూపాయల పెన్షన్ పొందాలనుకుంటే, పాలసీదారు ఏక మొత్తంగా 40 లక్షల 72 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి.
మరో ఆసక్తికర కథనం: ఆగస్టులో మారే ఇంపార్టెంట్ రూల్స్ తెలీకపోతే నష్టపోతారు, మీ పర్సుకు చిల్లు పడొచ్చు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ