అన్వేషించండి

Stocks To Watch 26 July 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Bajaj Finance, Tech Mahindra

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌-అప్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 26 July 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.40 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 25 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,882 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌-అప్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టాటా కన్స్యూమర్, BPCL, PNB. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

L&T: లార్సెన్ & టూబ్రో నికర లాభంలో 46% వృద్ధిని రూ.2,493 కోట్లకు నివేదించింది. ఆదాయం 34% పెరిగి రూ.47,882 కోట్లకు చేరుకుంది. సంస్థ చరిత్రలో మొదటిసారిగా షేర్‌ బైబ్యాక్‌ ప్రకటించింది. రూ.10,000 కోట్లను ఇందుకు కేటాయించింది. 3.33 కోట్ల షేర్లను ఒక్కోటి రూ. 3,000 చొప్పున టెండర్‌ ఆఫర్‌ పద్ధతిలో కంపెనీ తిరిగి కొనుగోలు చేస్తుంది.

SBI లైఫ్: 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బిఐ లైఫ్ రూ. 381 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. నికర ప్రీమియం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19% పెరిగి రూ. 13,104 కోట్లకు చేరుకుంది.

డెల్టా కార్పొరేషన్: 2023 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో డెల్టా కార్ప్ రూ. 68 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీకి రూ. 273 కోట్ల ఆదాయం వచ్చింది.

సియట్‌: 2023-24 మొదటి త్రైమాసికంలో సియట్ రూ. 145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 2,935 కోట్ల ఆదాయం సంపాదించింది.

టాటా మోటార్స్‌: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ నికర లాభాన్ని రూ.3,203 కోట్లను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 42% పెరిగి రూ. 1.02 లక్షల కోట్లకు చేరుకుంది.

పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: షేర్ బైబ్యాక్ ప్రతిపాదనను పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ పరిశీలిస్తోంది. దీనికి ఆమోదం తెలిపేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 28న సమావేశం అవుతుంది.

అంబర్ ఎంటర్‌ప్రైజెస్: Q1 FY24లో కంపెనీ నికర లాభం 9% పెరిగి రూ. 46 కోట్లకు చేరుకుంది. అయితే, ఆదాయం 7% తగ్గి రూ. 1,702 కోట్లకు చేరుకున్నాయి.

సైయెంట్: జూన్ త్రైమాసికంలో 46% వృద్ధితో సైయంట్ రూ. 168 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ.1,687 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇది కూడా చదవండి: నష్టాలకు టాటా! రూ.5007 కోట్ల లాస్‌ నుంచి రూ.3,203 కోట్ల ప్రాఫిట్‌!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Embed widget