Stocks Watch Today, 24 May 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' LIC, Nykaa, NMDC
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 24 May 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 73 పాయింట్లు లేదా 0.40 శాతం రెడ్ కలర్‌లో 18,288 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: LIC, హిండాల్కో ఇండస్ట్రీస్, నైకా, కమిన్స్ ఇండియా. ఈ షేర్లపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అశోక్ లేలాండ్: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఆదాయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో పెరిగినప్పటికీ, నికర లాభం దాదాపు 17% (YoY) తగ్గి రూ. 751.41 కోట్లకు పరిమితమైంది.
NMDC: మైనింగ్ మేజర్ ఎన్‌ఎండీసీ లిమిటెడ్, మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకీకృత నికర లాభంలో 22% వృద్ధితో రూ. 2,277 కోట్లను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 14% తగ్గి రూ. 5851 కోట్లకు చేరింది.
సిర్మా SGS టెక్: రెండు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు, ఒక దేశీయ ఫండ్ మంగళవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సిర్మా SGS టెక్నాలజీస్‌లో వాటాను కొనుగోలు చేశాయి.
వరుణ్ బెవరేజెస్: వరుణ్ బెవరేజెస్, తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా వరుణ్ బెవరేజెస్ సౌత్ ఆఫ్రికా (PTY) లిమిటెడ్‌ను జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభించింది.
మెట్రో బ్రాండ్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో మెట్రో బ్రాండ్స్ రూ. 68.5 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 544 కోట్ల ఆదాయం వచ్చింది.
బికాజీ ఫుడ్స్: జనవరి-మార్చి కాలంలో బికాజీ ఫుడ్ నికర లాభం 51% పెరిగి రూ. 37.7 కోట్లకు చేరుకుంది. ఆదాయం 16% పెరిగి రూ. 462 కోట్లకు చేరుకుంది.
డిక్సన్ టెక్నాలజీస్: డిక్సన్ టెక్నాలజీస్ నాలుగో త్రైమాసికంలో రూ. 81 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 2,065 కోట్లుగా ఉంది.
JSW ఎనర్జీ: JSW ఎనర్జీ జనవరి-మార్చి కాలానికి 272 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 2,670 కోట్ల ఆదాయం ఆర్జించింది.
డిష్ టీవీ: అనిల్ కుమార్ దువా రాజీనామాతో, కంపెనీ ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) మనోజ్ దోభాల్‌ను తదుపరి CEOగా నియమించాలని డిష్ టీవీ బోర్డు ప్రతిపాదించింది.
అమర రాజా బ్యాటరీస్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం రూ. 139 కోట్లతో 41% వృద్ధిని సాధించింది. ఆ త్రైమాసికంలో ఆదాయం రూ. 2,429 కోట్లుగా ఉంది.
టాటా కెమికల్స్: ముకుందన్‌ను మరో ఐదేళ్ల పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, CEOగా కొనసాగిస్తూ కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. ఈ నియామకం నవంబర్ 26, 2023 నుంచి అమలులోకి వస్తుంది.
సెంచరీ టెక్స్‌టైల్స్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో జారీ చేసి రూ. 400 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది.
ఇది కూడా చదవండి: అదానీ షేర్‌హోల్డర్ల ముఖాల్లో మతాబులు, 3 రోజుల్లో ₹1.8 లక్షల కోట్ల లాభం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.