(Source: ECI/ABP News/ABP Majha)
Stocks To Watch 17 August 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Power, JSW Energy
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 17 August 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.10 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 15 పాయింట్లు లేదా 0.08 శాతం రెడ్ కలర్‌లో 19,397 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ పవర్: అదానీ గ్రూప్‌లోని ఈ విద్యుత్ కంపెనీలో 1.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9000 కోట్లు) పెట్టుబడితో 8.1% వాటాను GQG పార్ట్‌నర్స్ కైవసం చేసుకుంది. అదానీ ఫ్యామిలీ, 8.1 శాతం వాటాకు సమానమైన 31.2 కోట్ల షేర్లను, ఒక్కో షేరును సగటను రూ. 279.17 ధరకు విక్రయించింది.
JSW ఎనర్జీ: 'GQG పార్టనర్స్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్', జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో 10,284,024 షేర్లు 0.6% వాటాను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ. 341.70 చొప్పున రూ. 351 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇండిగో: ఇండిగో కో-ఫౌండర్ రాకేష్ గంగ్వాల్ కుటుంబం బుధవారం (16 ఆగస్టు 2023) భారీ డీల్స్ ద్వారా ఈ విమానయా సంస్థలో కొంత వాటాను విక్రయించింది.
సిప్లా: నాణ్యమైన ఉత్పత్తి పద్ధతులను పాటించనందుకు, పాతాళగంగలోని (యూనిట్ II) సిప్లా తయారీ ఫ్లాంటుకు 10 రోజుల పాటు FDA లైసెన్స్‌ను రద్దు చేస్తూ FDA కొంకణ్ డివిజన్ ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో, 10 రోజుల పాటు లైసెన్స్ సస్పెన్షన్ వర్తిస్తుంది.
రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్: ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఫండ్, బుధవారం బ్లాక్ డీల్స్ ద్వారా రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో తనకు ఉన్న వాటా నుంచి 2.45 కోట్ల షేర్లను విక్రయించింది.
IIFL సెక్యూరిటీస్: హాంబ్లిన్ వాట్సా ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెల్ బుధవారం బ్లాక్ డీల్ ద్వారా IIFL సెక్యూరిటీస్‌లో తనకు ఉన్న వాటా నుంచి 1.2 కోట్ల షేర్లను లేదా 3.9% వాటాను విక్రయించింది.
ఫ్యూచర్ రిటైల్: ఈ కంపెనీ దివాలా ప్రక్రియ నిర్వహిస్తున్న రిజల్యూషన్ ప్రొఫెషనల్ NCLTని ఆశ్రయించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి సెప్టెంబర్ 15 వరకు గడువు పొడిగింపును కోరుతూ NCLTకి విజ్ఞప్తి చేశారు.
అమర రాజా బ్యాటరీస్: ఈ ఆర్థిక సంవత్సరంలో తన లిథియం-అయాన్ వ్యాపారాన్ని మూడు రెట్లు పెంచే ప్లాన్‌లో భాగంగా, మొదట ఛార్జర్‌ల ద్వారా, ఆ తర్వాత బ్యాటరీల ద్వారా టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన ఉనికి పెంచుకోవాలని అమర రాజా బ్యాటరీస్ ఆలోచిస్తోంది.
లుపిన్: కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్న వారిలో శస్త్రచికిత్స అనంతర వాపు చికిత్స కోసం ఉపయోగించే జెనరిక్ బ్రోమ్‌ఫెనాక్ ఆప్తాల్మిక్ సొల్యూషన్‌ను మార్కెట్ చేయడానికి యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ (US FDA) నుంచి అనుమతి పొందినట్లు లుపిన్ ప్రకటించింది.
వొడాఫోన్ ఐడియా: టెలికాం విభాగానికి తాను చెల్లించాల్సిన బకాయి కట్టడానికి మరో 30 రోజుల గడువు ఇవ్వాలని టెలికాం విభాగాన్ని (డాట్) వొడాఫోన్ ఐడియా కోరింది. ఈ టెలికాం కంపెనీ, ఈ నెల 17 కల్లా రూ. 1680 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిని చెల్లించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివైన మార్గం ఇది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.