Stocks to watch 12 April 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - నేడు TCS ఫలితాలు
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 12 April 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 3.5 పాయింట్లు లేదా 0.02 శాతం గ్రీన్ కలర్‌లో 17,790 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
డెలివెరీ: వెంచర్ క్యాపిటల్ ఫండ్ టటైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్', డెలివెరీలో మరో 1.6% వాటాను మంగళవారం బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించింది.
సాగర్ సిమెంట్స్: దేశీయ ఫండ్ హౌస్ 'PGIM ఇండియా మ్యూచువల్ ఫండ్', సాగర్ సిమెంట్‌లో తన వాటాను మంగళవారం బ్లాక్ డీల్ ద్వారా విక్రయించగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఆ షేర్లను కొనుగోలు చేసింది.
డెల్టా కార్పొరేషన్: మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ. 51 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని డెల్టా కార్ప్ నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 48 కోట్లతో పోలిస్తే ఇది 6% పెరుగుదల.
TCS: ఈ కంపెనీ తన నాలుగో త్రైమాసిక ఆదాయాలను ఇవాళ ప్రకటించనుంది, మార్కెట్ దృష్టి ఇవాళ టీసీఎస్ షేర్లపై ఉంటుంది. స్థూల ఆర్థిక మందగమనం కారణంగా, స్థిర కరెన్సీ ప్రాతిపదికన QoQ ఆదాయ వృద్ధి 1% కు పరిమితం అవుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
HDFC బ్యాంక్: రుణ సాధనాల (debt instruments) జారీ ద్వారా రూ. 50,000 కోట్ల వరకు నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించి, ఓకే చేసేందుకు HDFC బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 15న సమావేశం అవుతుంది.
సూల వైన్‌యార్డ్స్: ఈ ఆల్కహాల్ కంపెనీ బ్రాండ్ విక్రయాల మొత్తం 1 మిలియన్ కేసులను దాటాయి. ఎలైట్, ప్రీమియం వైన్‌లు మొదటిసారిగా 5 లక్షల కేసుల మార్కును అధిగమించాయి.
భెల్: ఇండియన్ రైల్వేస్ మెగా టెండర్‌లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నేతృత్వంలోని కన్సార్టియం 80 వందే భారత్ రైళ్ల కోసం, ఒక్కో రైలుకు రూ. 120 కోట్ల చొప్పున ఆర్డర్ గెలుచుకుంది.
లుమాక్స్ ఇండస్ట్రీస్: కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి వినీత్ సాహ్ని రాజీనామా చేశారు. ఈ నెల 14న పని వేళల ముగింపు నుంచి ఈ రాజీనామా అమలులోకి వస్తుంది.
వరుణ్ బెవరేజెస్: గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసిన వరుణ్ బెవరేజెస్ షేర్లు నేడు ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతాయి.
జైడస్ లైఫ్ సైన్సెస్: Tavaborole Topical Solutionను ఉత్పత్తి చేయడానికి, మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి జైడస్ లైఫ్‌సైన్సెస్‌కు తుది ఆమోదం లభించింది.
నెస్లే ఇండియా: డివిడెండ్ ప్రతిపాదనను పరిశీలించేందుకు నెస్లే ఇండియా డైరెక్టర్ల బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.