అన్వేషించండి

Stocks To Watch 11 August 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' LIC, Hero, Adani Wilmar

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 11 August 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 09 పాయింట్లు లేదా 0.05 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,550 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: ONGC, HAL, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నైకా. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

LIC: 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) స్వతంత్ర నికర లాభం ‍‌(standalone net profit) అనేక రెట్లు పెరిగి రూ. 9,544 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ. 683 కోట్లు. రిపోర్టింగ్ క్వార్టర్‌లో నికర ప్రీమియం ఆదాయం రూ. 98,363 కోట్లుగా ఉంది, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 98,351 కోట్లుగా నమోదైంది. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 30% జంప్‌తో, రూ. 69,571 కోట్ల నుంచి రూ.90,309 కోట్లకు చేరుకుంది.

హీరో మోటోకార్ప్‌: 2023-24 మొదటి త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ నికర లాభం 32% పెరిగింగి, రూ. 825 కోట్లకు చేరుకుంది. బైక్‌ తయారీ కంపెనీకి కార్యకలాపాల ద్వారా రూ. 8,767 కోట్ల ఆదాయం వచ్చింది, ఇది 4.5% గ్రోత్‌.

బయోకాన్: Q1 FY24లో బయోకాన్ రూ. 101 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌ను ప్రకటించింది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 3,422 కోట్ల రెవెన్యూ వచ్చింది.

సెయిల్: ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలంలో సెయిల్‌ మిగుల్చుకున్న నికర లాభం రూ. 212 కోట్లు. కార్యకలాపాల ద్వారా రూ. 24,359 కోట్ల ఆదాయాన్ని గడించింది.

క్యాంపస్ యాక్టివ్‌వేర్: మొదటి త్రైమాసికంలో రూ. 31 కోట్ల నికర లాభాన్ని క్యాంపస్ యాక్టివ్‌వేర్  ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ. 354 కోట్ల ఆదాయం సంపాదించింది.

ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్: FY24 ఫస్ట్‌ క్వార్టర్‌లో రూ. 679 కోట్ల నికర నష్టాన్ని ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ తలకెత్తుకుంది. కార్యకలాపాల ద్వారా రూ. 196 కోట్ల ఆదాయం వచ్చింది.

సనోఫీ ఇండియా: జూన్ త్రైమాసికంలో సనోఫీ ఇండియా నికర లాభం రూ.123 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా ఈ కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 706 కోట్లు.

మజగాన్ డాక్: Q1 FY24లో మజగాన్ డాక్ రూ. 314 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. ఆ సమయంలో వచ్చిన ఆదాయం రూ. 2,172 కోట్లపై ఆ ప్రాఫిట్‌ మిగిలింది.

టొరెంట్ పవర్: ఏప్రిల్-జూన్ కాలానికి టొరెంట్ పవర్ రూ. 532 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 7,377 కోట్లుగా ఉంది.

అదానీ విల్మార్: అదానీ విల్మార్‌లో తనకున్న 44% వాటాను అమ్మే మార్గాల కోసం వెదుకుతున్నట్లు, కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఖండించింది.

ఇది కూడా చదవండి: ఇల్లు కొనే వాళ్లు హ్యాపీ, గుడ్‌న్యూస్‌ చెప్పిన రిజర్వ్‌ బ్యాంక్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Bima Sakhi Yojana: 10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
Embed widget