By: Arun Kumar Veera | Updated at : 09 Dec 2024 03:36 PM (IST)
బీమా సఖి పథకం అంటే ఏమిటి? ( Image Source : Other )
Women Scheme Bima Sakhi Yojana Details In Telugu: దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా, మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని స్కీమ్‌లు రన్ చేస్తోంది.
తాజాగా, కేంద్ర ప్రభుత్వం, దేశంలోని మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు "బీమా సఖి". ఈ పథకం కింద, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), హరియాణాలోని పానిపత్‌లో ఈ రోజు (09 డిసెంబర్ 2024) బీమా సఖి యోజనను ప్రారంభించారు.
బీమా సఖి పథకం అంటే ఏమిటి? (What is Bima Sakhi Scheme?)
బీమా సఖి యోజనలో భాగంగా, మహిళలను బీమా సంబంధిత పనులు నిర్వహించేందుకు శిక్షణ పొందుతారు, సమర్థులుగా తయారవుతారు. ఈ పథకం ద్వారా, మహిళలు "లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" (Life Insurance Corporation of India - LIC) బీమా సఖిగా నియమితులవుతారు. అంటే, వారు LIC ఏజెంట్లుగా చేరతారు. పథకంలో చేరిన నాటి నుంచి బీమా సఖులు ప్రజలకు బీమా చేయగలరు. ఈ ప్రభుత్వ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు చాలా ప్రయోజనం పొందుతారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధారణంగా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి, మహిళా సాధికారతకు అవకాశం ఇస్తుంది.
బీమా సఖులకు డబ్బులు ఇస్తారా?
ఈ పథకంలో చేరిన బీమా సఖులకు, పథకం కింద, ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందజేస్తారు. పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెలా రూ. 7,000 ఇస్తారు. రెండో సంవత్సరంలో ఈ మొత్తం రూ. 1,000 తగ్గి రూ. 6,000 అవుతుంది. మూడో సంవత్సరంలో మరో రూ. 1,000 తగ్గి ప్రతి నెలా రూ. 5,000 వస్తుంది. ఇది కాకుండా, మహిళలకు ప్రత్యేకంగా రూ. 21,000 అందుతుంది. అంతేకాదు, బీమా లక్ష్యాలను పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక కమీషన్ కూడా చేతికి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బీమా సఖి పథకం మొదటి దశలో 35,000 మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పిస్తారు. ఆ తర్వాత, 50,000 మందికి బీమా సఖి యోజన ప్రయోజనాలు కల్పిస్తారు. ఇలా 3 సంవత్సరాల్లో 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
బీమా సఖి పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి, మహిళల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో www.licindia.in ను సందర్శించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఏయే ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డ్‌తో రూ.5 లక్షల ఉచిత చికిత్స పొందొచ్చు?
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ కొనడానికి బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది, ఎంత EMI చెల్లించాలి?
Gold-Silver Prices Today 24 Mar: పసిడి నగల రేట్లు మరింత పతనం - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Unified Pension Scheme: మరో 10 రోజుల్లో 'ఏకీకృత పింఛను పథకం' - ఇలా దరఖాస్తు చేసుకోండి
Toll Deducted Twice: టోల్ గేట్ దగ్గర రెండుసార్లు డబ్బు కట్ అయ్యిందా? - ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది
Tirumala News: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Salman Khan: రష్మిక కూతురితోనూ నటిస్తా... ఆమెకు లేని ఇబ్బంది మీకేంటి? ఏజ్ గ్యాప్ కాంట్రవర్సీపై సల్మాన్ స్ట్రాంగ్ రియాక్షన్