Stocks To Watch 07 August 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' RIL, SBI, Delhivery
స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 07 August 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 26 పాయింట్లు లేదా 0.14 శాతం గ్రీన్ కలర్‌లో 19,615 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: గోద్రెజ్ కన్స్యూమర్, టోరెంట్ ఫార్మా, మాక్స్ హెల్త్‌కేర్, PB ఫిన్‌టెక్, టాటా కెమికల్స్. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
బ్యాంక్ ఆఫ్ బరోడా: 2023-24 జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం 88% పెరిగి రూ. 4,070 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII) సంవత్సరానికి 24% పెరిగి రూ. 10,997 కోట్లకు చేరుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను త్వరలోనే లిస్ట్ చేస్తామని, ఆ కంపెనీ దేశంలోనే అతి పెద్ద నాన్-బ్యాంకింగ్ లెండర్‌గా మార్చాలని భావిస్తున్నామని తన వార్షిక నివేదికలో రిలయన్స్ వెల్లడించింది.
డెలివెరీ: లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ డెలివెరీ లిమిటెడ్, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తన నష్టాలను గణనీయంగా తగ్గించింది. ఆ త్రైమాసికంలో ఏకీకృత నికర నష్టం రూ. 89.5 కోట్లకు తగ్గింది, ఇది ఏడాది క్రితం రూ. 399 కోట్లుగా ఉంది.
బ్రిటానియా: బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ Q1లో 36% పెరిగి రూ. 458 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8% పెరిగి రూ. 4,011 కోట్లకు చేరుకుంది.
అరబిందో ఫార్మా: వాంకోమైసిన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్టబుల్స్ తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి అరబిందో ఫార్మాకు చెందిన యుజియా ఫార్మాకు US FDA నుంచి తుది ఆమోదం లభించింది.
అఫ్లే (ఇండియా): 2023 ఏప్రిల్-జూన్ కాలంలో అఫ్లే (ఇండియా) రూ. 66 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 407 కోట్ల ఆదాయం సంపాదించింది. గత ఏడాది కంటే ఇది 17% వృద్ధి.
బలరాంపూర్ చీనీ మిల్స్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బలరాంపూర్ చీనీ మిల్స్ రూ. 69.3 కోట్ల నికర లాభం సంపాదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,390 కోట్లు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: జూన్ క్వార్టర్‌లో రూ. 153 కోట్ల నికర లాభాన్ని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 738 కోట్లుగా ఉంది.
ICICI బ్యాంక్: ఐసీఐసీఐ లాంబార్డ్‌లో వాటాను 4% వరకు పెంచుకోవాలన్న ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతిపాదనకు RBI ఓకే చెప్పింది.
డెల్టా కార్పొరేషన్: వృత్తిపరంగా కొత్త అవకాశాలు స్వీకరించడానికి, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి హార్దిక్ ధేబర్ రాజీనామా చేశారు.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన అకౌంట్ బుక్స్‌ను క్లీన్ చేసుకోవడానికి రూ. 96,000 కోట్లకు పైగా మొండి బకాయిలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించాలని చూస్తోంది.
ఇది కూడా చదవండి: నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కొంటున్నారా, అది పూర్తయితేనే టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయని తెలుసా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.